వీరమల్లు ఫ్యాన్స్ కు పవన్ మరో అదిరిపోయే ట్రీట్

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అభిమానులు ఎదురుచూసిన తరణం వచ్చేసింది. బిగ్ స్క్రీన్ పై పవ‌న్‌ను చూసుకోవాలనే కోరిక అభిమానులకు త్వరలోనే తీరనుంది. మొదటి జూన్‌2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో పవన్ అభిమానులంతా ఫుల్ జోష్‌లో మునిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో.. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమాను కొద్దిరోజులు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో.. పవన్‌ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు డజన్ సార్లు వాయిదా పడిన ఈ సినిమాను.. మరోసారి వాయిదా వేయడం.. అదికూడా జూన్ 12న ఇది వచ్చేస్తుందని అభిమానులంతా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యు ధియేటర్ల వద్ద భారీ ప్లానింగ్ కూడా మొదలుపెట్టేసారు. ఇలాంటి క్రమంలో సినిమా వాయిదా పడడంతో అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమా ఈ నెలాకరకు లేదా వచ్చేనెల ప్రారంభంలో రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే పవన్ అభిమానులను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక.. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన తొలిప్రేమ సినిమాను రిలీజ్ చేయనున్నార‌ని టాక్ వైరల్ గా మారుతుంది.

Hari Hara Veera Mallu Part 1: First Song to be out on THIS date

1998 జూన్ 24న రిలీజ్ అయిన ఈ సినిమాను.. మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక సినిమాల్లో హీరోయిన్గా కీర్తి రెడ్డి నటించగా.. కరుణాకరన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జి.వి.జి రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. ఇప్పటికే.. ఈ సినిమా ఎన్నోసార్లు రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇక తొలిప్రేమ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తైన‌ సందర్భంగా.. 2023లో చివరిసారిగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నారని సమాచారం. అయితే.. ఇదే పోస్టర్‌ను స్వయంగా సినిమా ప్రొడ్యూసర్ నిర్మాత ఎస్. కే. ఎన్ కూడా షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 12న వీరమల్లు సినిమా వాయిదా పడిందని డిసప్పాయింట్ అవుతున్న అభిమానులకు తొలిప్రేమ సినిమా రిలీజ్ ఉత్సాహాన్ని ఇస్తుంది.