టాలీవుడ్ క్రేజీ హీరో నారా రోహిత్, హీరోయిన్ సిరిలెళ్లా వివాహం త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ జంట ఏడడుగులు వేయనున్నారు. గతేడాది వీళ్ళిద్దరికీ గ్రాండ్ లెవెల్ లో ఎంగేజ్మెంట్ జరిగగా.. రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణంతో కుటుంబ అంతా ఈ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. తండ్రి మరణం తర్వాత దుఃఖంలో ఉన్న నారా రోహిత్‌కు.. అండగా సిరిలెళ్లా నిలిచారు. అడుగడుగునా ఆయనకు గ్రాండ్ సపోర్ట్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ జంట ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియాలో అడలైజ్ ప్రాంతంలో.. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమం జరుగుతుండగా.. కాబోయే భార్యతో కలిసి పాల్గొన్నాడు నారా రోహిత్.
ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఘనతల గురించి.. ఆయనతో తనకున్న అనుబంధం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి గురించి అందరితో షేర్ చేసుకున్నారు. ఇక వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన నారా రోహిత్.. ఆల్మోస్ట్ ఆరేళ్ల తర్వాత ప్రతినిధి 2 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ కాకున్నా.. నారా రోహిత్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన భైరవంతో.. మరోసారి ఆయన ఆడియన్స్‌ని పలకరించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ వజ్రోత్సవంలో సిరిలెళ్లాతో కటిసి పాల్గొన్న నారా రోహిత్.. కాబోయే భార్యతో కలిసి ట్రిప్‌ను కూడా ఎంజాయ్ చేశారు. ఈక్రమంలోనే అక్కడ రోభాత్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసానని సిరి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తర్వాత ఆడిలైట్ వెళ్లిన ఈ జంట ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సిరి సిస్టర్ ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్న నేపథ్యంలో.. వాళ్లను ఈ జంట కలిసినట్లు పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తాజాగా భైరవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇది ఓ మల్టీస్టారర్ మూవీ కాగా.. నారా రోహిత్ సోలోగా నటిస్తున్న మూవీ.. సుందరకాండ. త్వరలోనే ఆడియోస్లో పలకరించనుంది. ఇక మరోపక్క సిరిలెళ్లా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాల్లో మేరవనుంది.