సౌత్ స్టార్ ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి హిట్లు కొట్టిన సమంత.. ఖుషి తర్వాత తెలుగులో ఒక సోలో సినిమాలో కూడా నటించింది లేదు. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్లూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా.. ట్రలాల ప్రొడక్షన్ స్థాపించి.. శుభం సినిమాను నిర్మించింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది సామ్. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఫ్యాన్స్ కు దగ్గరగానే ఉంటుంది.
ఇక గత కొద్ది నెలలుగా సమంత.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమొరతో రిలేషన్‌లో ఉందంటూ.. వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా మరోసారి ఈ అమ్మడు.. రాజ్ నిడమొరుతో కలిసి అడంగా దొరికిపోయింది. సామ్ రాజ్‌తో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వైరల్‌గా మారుతున్నాయి. సమంత, రాజ్ నిడమూరుతో లివింగ్ రిలేషన్‌లో ఉందని.. ఒకసారి రాజ్‌కు అఫీషియల్ గా డివర్స్ వచ్చేస్తే.. వెంటనే సమంతతో అతని వివాహం జరిగిపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే సామ్ కూడా.. రోజురోజుకు రాజ్‌తో ఉన్న మరింత క్లోజస్ట్ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ఆడియన్స్ లో మరిన్ని సందేహాలను కల్పిస్తుంది.
తాజాగా.. ఆమె దుబాయ్ డిసర్ట్స్‌లో దిగిన ఫోటోలను అభిమానంతో పంచుకుంది. ఈ పిక్స్‌లో తన సన్ గ్లాసెస్‌లో రాజ్ కనిపించడం హైలెట్‌గా మారింది. మరోసారి వీళ్ళిద్దరూ కలిసి ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇలా.. సమంత ఎప్పటికప్పుడు రాజ్‌తో కలిసి అభిమానుల కళ్ళకు చిక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఈ ప్రేమ పక్షులు రెండు దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నాయని.. ఇలా అడ్డంగా దొరికిపోయావ్ ఏంటి సామ్ అంటూ.. రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
View this post on Instagram