రాజాసాబ్.. ఆ ఒక్క డైలాగ్‌తో సినిమాపై హైప్ పెంచేశారుగా..!

రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రాజాసాబ్. రొమాంటిక్ కామెడీ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న ఈ తెలుగు సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెల‌కొంది. రాజాసాబ్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించ నుంది. ఇక ఈ సినిమా టీజర్ జూన్ 16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో నటిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిన తర్వాత మారుతి లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో.. ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.

Prabhas looks nothing like himself in fresh poster for The Raja Saab; new  poster unveiled on 45th birthday - Hindustan Times

అంతేకాదు.. ఇందులో ఆడియన్స్ ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను వింటేజ్ ప్రభాస్‌ని చూడనున్నారట. కామెడీ, సాంగ్స్ అదిరిపోతాయని చెప్తున్నారు. దీంతో రాజాసాబ్‌ కోసం సాధారణ ఆడియన్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మారుతి ఒకే ఒక్క మాటతో ఈ సినిమాపై అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్లో పాల్గోన ఆయన మాట్లాడుతూ.. రాజాసాబ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అభిమానులు ఏమి ఆశిస్తున్నారో.. దానికంటే ఒక్కింత ఎక్కువే రాజాసాబ్‌లో కనిపిస్తుంది.

Director Maruthi on Prabhas starrer 'The Raja Saab': "It's the kind of film  fans expect from me" | - The Times of India

ప్రభాస్ పై నా ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూస్తారు అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక‌ మారుతి చెప్పిన‌ ఈ ఒక డైలాగ్‌తో అయన రాజాసాబ్‌ సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో క్లారిటీ వచ్చేసింది. జూన్ 16న రిలీజ్ కానున్న టీజర్ తో అస్సలు సినిమా ఎలా ఉండబోతుందో మరింత క్లారిటీ రానుంది. ఇక ఈ గ్లింప్స్ ఆడియ‌న్స్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మాత్రం సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోతాయి అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.