మోక్షజ్ఞ లైఫ్‌లో అసలు ఆ యోగమే లేదు.. వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..!

నందమూరి నట వారసులుగా ఇప్పటికే మూడు జనరేషన్ నుంచి హీరోలు అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థర్డ్ జనరేషన్ హీరోలుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. ఈ కోవాలనే నందమూరి బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇక‌ బాలయ్య అభిమానులంతా కళ్ళు కాయలుకాచేలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా.. మొదట మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బాలయ్య డైరెక్షన్‌లో ఉంటుందంటూ టాక్‌ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత బాలయ్య సినిమాలోనే మోక్షజ్ఞ కీలక పాత్రలో మెరవనున్నాడంటూ వార్తలు వినిపించాయి.

ఇక‌ ఆదిత్య 369 సినిమాకు సిక్వల్గా.. ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా ఇప్పటికే మోక్షజ్ఞ మూవీ గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండనుందని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అనౌన్స్మెంట్ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఈ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో.. ఈ సినిమా ఆగిపోయిందని టాక్ కూడా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశాడు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ లేట్ అవ్వచ్చు కానీ.. కచ్చితంగా ఆయన ఇండస్ట్రీకి వస్తాడంటూ చెప్పుకొచ్చాడు.

మోక్ష‌జ్ఞ‌ నందమూరి హీరోల్లో ఒకరిగా సక్సెస్ అందుకుంటాడు అంటూ వివరించాడు. అంతేకాదు.. నందమూరి ఫ్యామిలీ సినీ రంగంలేనే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. మోక్షజ్ఞ రాజకీయాల్లో మాత్రం అస్సలు అడుగు పెట్టర‌ని.. ఒకవేళ అడుగుపెట్టిన ఆయనకు ఫలితం ఉండదని.. రాజకీయాల్లో మోక్షజ్ఞకు అసలు కలిసి రాదంటూ జ్యోతిష్యం చెప్పుకొచ్చాడు. సినిమాల్లో మాత్రం కచ్చితంగా పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉందని.. ఆలస్యమైన తండ్రిలానే మంచి ఇమేజ్ను సంపాదించుకుంటాడు అంటూ వేణుస్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.