14 దేశాల్లో 48 స్టోర్లు.. బిజినెస్ క్వీన్ గా మెరిసిన మంచు విరానిక..!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కోడలు.. మంచు విష్ణు భార్య మంచి విరానికా గురించి ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టిన విరానికా.. మంచు విష్ణు తో ప్రేమాయణం తర్వాత 2009లో అతనిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. భారీ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి కోడలు అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అటు రాజకీయాలకు, ఇండస్ట్రీ పనులకు దూరంగా ఉంటేనే.. తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని సత్తా చాటుతుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. బిజినెస్ క్వీన్‌గా రాణిస్తుంది. అది కూడా నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆమె తన బిజినెస్ను అంచలంచెలుగా పెంచుకుంటూ పోతుంది.

Viranica Manchu | Presenting Maison Ava. An haute couture kids clothing  label. Hand crafted perfection. Intricate detailing. Ultimate luxury for  your... | Instagram

ఇంతకీ విరానికా బిజినెస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. తన ఫ్యాషన్ మార్కెటింగ్ చదివును ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో పూర్తిచేసింది. 2022లో మైసన్ ఆవా పేరుతో కిడ్స్ క్లాటింగ్ స్టోర్ ను ప్రారంభించిన విరానికా.. ఈ లగ్జరీ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకువెళ్ళింది. ఇక ఈ బ్రాండ్ పేరు మీద 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న బట్టలను అమ్ముతూ ఉంటారు. కంఫర్టంట్, చైల్డ్ ఫ్రెండ్లీ, డిజైన్ దుస్తులను మై సన్ ఆవా డిజైన్ చేసి విక్రయిస్తూ మంచి క్రేజ్ ను దక్కించుకుంది.

Viranica Manchu - Founder and Creative Director - Maison Ava | LinkedIn

దీంతో బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీస్ అంత తమ పిల్లలకు ఇదే బ్రాండ్ నుంచి దుస్తులను సెలెక్ట్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే విరాణిక క్లాతింగ్ బ్రాండ్ ఏకంగా 14 దేశాలకు వ్యాపించింది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్గా 48 మైస‌న్ ఆవా స్టోర్‌లు ఉండడం విశేషం. అంతేకాదు.. లండన్ లో 175 ఏళ్ల హిస్టరీ ఉన్న హౌ రోడ్స్ మాల్లో సైతం.. మై సన్ ఆవా బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించిన మొట్టమొదటి ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ గా విరానికా తన సత్తా చాటుకుంది. రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. స్వయంగా ఈ విషయాలను రివిల్ చేస్తూ నా భార్య బిజినెస్ లో నాకంటే చాలా తోపు.. తన క్లోతింగ్ బ్రాండ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ లో మైంటైన్ చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు.