మరికొద్ది క్షణాల్లో అఖండ 2 టీజర్ రిలీజ్.. బాలయ్య ఆ డైలాగ్స్ చూస్తే గూస్ బంప్సే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ కాంబో అనడంలో సందేహం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో సాధారణ సినిమాలు రూపొందుతున్నాయి అంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో నెలకొంటాయి. ఎందుకంటే.. వీళ్ళిద్దరికీ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబో అయిన ఇవ్వని కిక్.. ఈ కాంబినేషన్ కి సాధ్యం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వీళ్ళిద్దరి కాంబోలో వచనం మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా అఖండ సినిమాకి అయితే బాలయ్య లైఫ్ ఛేంజ్‌ చేస్తే రేంజ్ లో రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆలోచన విధానాన్ని సినిమా పూర్తిగా మార్చేసింది అనడంలో సందేహం లేదు. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రస్తుతం ఆయన.. అఖండ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు.

Akhanda 2: Thaandavam teaser's date and time locked | Telugu Cinema

ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే.. ఫ్రీ రిలీజ్ థియెట్రిక‌ల్ బిజినెస్ పూర్తి అయిపోయింది.. అంటేనే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ.. సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సాయంత్రం 6:03 నిమిషాలకు రిలీజ్ కానున్న ఈ టీజర్ పై ఆడియన్స్ లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. కాగా టీజర్ లో అభిమానులు రోమాలు నిక్కబడుచుకునేలా బాలయ్య నటతాండవం చేయనున్నాడని చెబుతున్నారు. బాలయ్య మార్క్‌ డైలాగ్స్ తో పాటు.. రెండు మూడు యాక్షన్ షాట్స్ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తాయని.. అభిమానులకు పూనకాలు కాయమంటూ స‌మాచారం. ఇదే టీజర్ లో సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించనున్నారట. ముందుగా సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్.

Akhanda 2 - Thaandavam': Release date of Nandamuri Balakrishna's film with  Boyapati Sreenu announced - The Hindu

కానీ.. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో అక్టోబర్ లేదా నవంబర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ అప్పటికి సినిమా పూర్తి కాకుంటే సంక్రాంతి బరిలో సినిమాను దింపే ప్లాన్ చేస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం సినిమా వాయిదా పడే అవకాశం లేదట‌. సెప్టెంబర్ 25న‌ సినిమా రిలీజ్ చేస్తారంటున్నారు. ఎదమైన మరికొద్ది క్షణాల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఎస్ ఎస్ థ‌మన్ బాలకృష్ణ సినిమాలంటే పూన‌కాలు వచ్చినట్లు రీ రికార్డు మ్యూజిక్ తో అదర్ కొడతాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రిలీజ్ కు కొద్ది గంటల ముందే.. అఖండ 2పై మరింత హైప్‌ను పెంచేస్తున్నాడు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అఖండ 2ను ఉద్దేశిస్తూ.. థ‌గథ‌గ తాండవమే అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం థ‌మన్ చేసిన ఈ ట్వీట్ ఆడియన్స్‌లో టీజర్ పై మరింత హైప్ పెంచేసింది. ఇక టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.