టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆనందపడేలోపు.. ఆనందం కాస్త ఆవిరి అయిపోయింది. జూన్ 12న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. గ్రాఫిక్స్ పని పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏ.ఏం. రత్నం.. వీరమల్లును మరోసారి వాయిదా వేశారు. యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైన తర్వాత.. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ ఇలా వాయిదా పడడం అందరికి షాక్‌ను కలిగించింది. ఇక సినిమాను జూలై 4న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కానీ.. అదే రోజు దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుంది.
కింగ్డమ్ మూవీ మార్చ్ 28 నుంచి ఏప్రిల్ లేదా మేలో.. మార్చి రిలీజ్ చేయవచ్చు. కానీ దానికి కింగ్డమ్ మేకర్స్ అసలు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ప్రశ్నగా మారింది. కింగ్డం తర్వాత వారంలో.. అనుష్క – ఘాటీ, నితిన్ – తమ్ముడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో.. పవన్ మూవీకి సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. మరోపక్క.. జూన్ నెలలోనే మూవీ కచ్చితంగా రిలీజ్ చేయాలని మేకర్స్ పై ఓటీటీ ఒత్తిడి ప్రారంభించింది. ఇక.. ఇప్పటికే 12సార్లు వాయిదా పడిన వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడడంతో యాంటి ఫ్యాన్స్ సినిమాలు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్.. డిస్ట్రిక్ట్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఈ మూవీ జనవరి 1, 2090లో రిలీజ్ అవుతుంది అంటూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కొన్ని నెలల క్రితం లాంచ్ అయిన ఈ.. సినిమా టికెట్ బుకింగ్స్ యాప్.. జనవరి 1, 2026 అని అనౌన్స్ చేసి ఉంటే ఆ విషయాన్ని చాలామంది ఆడియన్స్ నమ్మేసేవారు. కానీ.. ఎప్పుడెప్పుడు అని అభిమానులంతా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏకంగా 65 ఏళ్ల తర్వాత థియేటర్లోకి వస్తుందని ట్రోల్ చేయడంతో.. పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్‌పై ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి మొదట వీరమల్లు సినిమాపై ఊహించిన అంచనాలైతే లేవు. పవన్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హడావిడి అసలు కనిపించలేదు. యూఎస్ లో రెండు వరాలపాటు అడ్వాన్స్ బుకింగ్ జరిగినా కూడా ఒక్క మిలియన్ మార్క్ కూడా కనీసం టచ్ చేయలేకపోయింది. ఇన్నిసార్లు వాయిదా పడడంతో.. మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కూడా.. అభిమానులు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.
District App updated Hari Hara Veera Mallu release date as 1st Jan 2090!!#PawanKalyan | #HHVM pic.twitter.com/M4fCsYsNIh
— Movies4u Official (@Movies4u_Officl) June 8, 2025