పుష్ప 3 రిలీజ్ అప్పుడే.. నిర్మాత గూస్ బంప్స్ అప్డేట్..!

తెలుగు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన‌ పుష్ప ఫ్రాంచైజ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట పుష్ప సినిమాతో సౌత్‌తో పాటు.. నార్త్ లోను మంచి ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్న సుకుమార్ పుష్ప 2పై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను పెంచేశాడు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర సినిమా రికార్డుల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే సాలిడ్ హిట్ సొంతమైంది. ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది.

Ravi Shankar Yalamanchili - Movies, Biography, News, Age & Photos |  BookMyShow

ఇక ఈ సినిమా నెక్స్ట్ పార్ట్ పుష్ప 3 కూడా రానుందని.. క్లైమాక్స్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే పుష్ప 3 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా.. పుష్ప 2 ప్రీమియర్ షో ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి రావడంతో.. పుష్ప 3లో బన్నీ నటించడని.. సుకుమార్‌కు పుష్ప 3 ఉండదని కరాకండిగా చెప్పేసాడంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు.

Pushpa 3: The Rampage Movie - Trailer, Star Cast, Release Date | Paytm.com

కాగా.. తాజాగా పుష్ప ప్రాంచైజ్‌ పుష్ప 2 రిలీజ్‌లో కన్ఫర్మ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప 3.. 2028లో రిలీజ్ చేస్తామంటూ వెల్లడించాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మైథ‌లాజికల్ మూవీలో నటించనున్నాడ‌ని సమాచారం. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే.. పుష్ప 3 సెట్స్‌లోకి అడుగుపెడతాడని సమాచారం. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ పుష్ప 3 అప్డేట్‌పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.