ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్‌సంపాదించుకున్నాడు చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న చిరు.. తన సినిమాలతో రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అలాంటి హీరోతో జతకట్టాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఆరాటపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ సైతం చిరంజీవితో రొమాన్స్‌కు సిద్ధమైన, నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు చిరంజీవి సినిమాలు రిజెక్ట్ చేసి ఘోరంగా అవమానించిందట.
ఇంతకీ ఆమె ఎవరో కాదు గౌతమి. తెలుగు, తమిళ్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న గౌతమి.. 90వదశకంలో స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగులో కృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న గౌతమి.. చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చిన చేయనని చెప్పేసిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. దానికి గల కారణాలను వివరిస్తూ.. చిరుతో నటించినందుకు.. నేను చాలా బాధపడ్డా. మూడుసార్లు ఆయన సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చిన నేను నటించలేకపోయాను.
ప్రతిసారి వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాలను వదులుకున్న. రజినీకాంత్ సినిమాతో పాటు.. మరికొన్ని సినిమాలకు అప్పటికే సాయం చేసి ఉండడంతో చిరంజీవి గారితో సినిమాలు చేయలేకపోయా. నావల్ల ఆయన మూడుసార్లు అప్సెట్ అయ్యారంటూ గౌతమి వివరించింది. అయితే గౌతమి రిజెక్ట్ చేసిన చిరు సినిమాలు ఏంటో మాత్రం ఆమె రివిల్ చేయలేదు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన మెగాస్టార్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. గౌతమికి ఏకంగా మూడుసార్లు చిరుతో నటించే ఛాన్స్ వచ్చిందా.. అయినా అనవసరంగా మిస్ చేసుకుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.