టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్ సి 16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. రంగస్థలం తర్వాత చాలా కాలానికి చరణ్ మళ్ళీ అదే విలేజ్ నేటివిటీ నేపథ్యంలో నటించనున్న ఈ సినిమా ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా.. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో రూపొందుతుందని సమాచారం. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సాధారణంగా ఏదైనా ఒక్క ఆట చుట్టూనే కథ మొత్తం తిరిగేలా చూపిస్తారు. కానీ.. ఆర్సి16 లో మాత్రం నియమాలు అన్నింటినీ బ్రేక్ చేస్తూ క్రికెట్, కుస్తీ, కబాడీ లాంటి వేర్వేరు ఆటలను కథలో మిక్స్ చేసి మరి చూపించనున్నారట.
ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఆట కూలీగా ఉండబోతుందని టాక్. దీంతో ఆడియన్స్ లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. సినిమా మొత్తం గ్రౌండ్లోనే నడుస్తుందా.. లేదా వీటన్నింటినీ కలిపి ఒక వైవిధ్యమైన కథను డైరెక్టర్ రాశాడా.. అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. ఈ సినిమాలో ప్రత్యేకమైన కోచ్ పాత్ర కూడా ఉందని.. ఆ క్యారెక్టర్ కోసం ఎంఎస్ ధోని ని సెలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటించనున్నాడు. ఇక ఆయనతోపాటు.. జగపతిబాబు, మేఘన రాజ్ లాంటివారు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆట కోణంలోనే కాకుండా.. ఎమోషనల్ డ్రామాతోను సినిమా ఆకట్టుకొనుందని.. కథలో చరణ్ పాత్రకు ఇంటన్సిటీ ఎక్కువగా ఉండబోతుందని సమాచారం.
ఇక ఏ. ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది. ఇక సినిమాలో నిజమైన మాస్ ట్రీట్ కోసం.. ఆర్టిఫిషియల్ గా వేసిన సెట్స్ కాకుండా.. ఎక్కువగా రియల్ లొకేషన్స్, నాచురల్ ఫిలిం కోసం ప్రత్యేకమైన సెట్స్ కాకుండా.. నిజమైన మైదానాలు, గ్రామీణ వాతావరణ లాంటిది స్క్రీన్ పై కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు. గతంలో రంగస్థలంతో చరణ్ నేటివిటీ మాస్ లుక్ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌తో అభిమానులకు ఊహించని మాస్ ట్రీట్ ఇవనున్నాడట. ఇక సినిమాలో 2025 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి హై స్పీడ్‌తో సినిమా షూట్ కొనసాగుతుంది. టీజర్, ఫస్ట్ లుక్ అప్డేట్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.