ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లెజెండ్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ప్రొఫెషనల్ గా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకున్న.. పర్సనల్ గా మాత్రం ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ నాకు బాలయ్య తో కలిసి ఒక ఫ్రాక్షన్స్ సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఎవరైనా రచయితలు క్యారెక్టర్స్ తో కథ రాసి తీసుకురండి. మేము చేస్తామంటూ వివరించాడు. ఈ క్రమంలోనే అప్పటినుంచి ఇద్దరు హీరోలు కలిసి సినిమాలో నటించబోతున్నారంటూ రకరకాల దర్శకుల పేర్లు తెగ వైరల్ గా మారాయి.
ఇక మైత్రి మేకర్స్ ఇద్దరు హీరోలతో కలిపి సినిమా నిర్మాతలుగా వ్యవహరించడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా బాలయ్య, చిరంజీవి కలిసి ఓ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తమిళ్ జైలర్ 2 సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇకగతంలో తెరకెక్కిన జైలర్ సినిమాల్లో కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ జాకీష్రఫ్ గెస్ట్ పాత్రలో కనిపించారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య జైలర్ 2లో ఓ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. జైలర్ సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ బాలయ్యకు పాత్ర అనుకున్నారని కుదరలేదు అంటూ అఫీషియల్ గా వివరించాడు. ఈ క్రమంలోనే జైలర్ 2లో శివరాజ్ కుమార్, మోహన్, లాల్ జాకీ ష్రప్‌తో పాటు.. బాలయ్య కూడా ఉంటాడంటూ ప్రచారం స్ట్రాంగ్‌గా కొనసాగుతుంది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం జైలర్ 2 లో.. వీళ్ళ అందరితో పాటు.. చిరంజీవి కూడా ఉండనున్నాడట. ఇప్పటికే చిరుని.. రజినీకాంత్ ఫోన్ చేసి అడిగి ఒప్పించారని.. తమిళ్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇదే వాస్తవం అయితే బాలయ్య, చిరు ఒకేసారి స్క్రీన్ పై కనిపించకుండా ఒకే సినిమాలో కనిపిస్తారన్నది టాక్. ఇక సినిమాలో ఓ పక్కన చిరు.. మరో పక్కన బాలయ్య ఇద్దరు కూడా ఐదు నిమిషాల గెస్ట్ పాత్రల్లో మెరువనున్నారట. కాగా.. రజనీకాంత్ జైలర్ 2లో ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోస్ మాత్రం కనిపించినా చాలు.. సినిమాకు విపరీతమైన క్రెజ్ దక్కుతుంది అనడంలో సందేహం లేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్లాస్ చేయడం కాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.