ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రేమ ఇప్పటికి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా డివోషనల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. సొంత భాష కన్నడలో కెరీర్ ప్రారంభించి.. శివరాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో ధర్మ చక్రం మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె నటించిన కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్, దేవి, దీర్ఘ సుమంగళీభవ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంగానే 2006లో బిగ్గెస్ట్ బిజినెస్ మాన్ జీవన్ అప్పచును ప్రేమించి వివాహం చేసుకుంది.
అయితే వైవాహిక జీవితంలో ఎదురైన మనస్పర్ధలు కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక పర్సనల్గా కుంగిపోయిన ప్రేమ.. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ 14 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇటీవల నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించినా.. అనుకోని ప్రయాణం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రేమ.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. స్టార్ హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో.. చిరునవ్వుతో సినిమాల్లో సహయనటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. మంచి ఫామ్ లో ఉన్న టైంలో.. త్రివిక్రమ్ కథలో అవకాశం వచ్చిందని.. బావతో పెళ్లొద్దని ఒక మోసగాడిని పెళ్లి చేసుకుని మోసపోయిన అమ్మాయి పాత్రలో కనిపించాలని చెప్పడంతో తాను కొంచెం సంకోచించినట్లు వివరించింది.
ఇందులో మరో హీరోయిన్ ఉందా అని ఆమె ప్రశ్నించగా.. ఇందులో మీది కూడా హీరోయిన్ పాత్రేనని చెప్పారని.. మూవీలో కథ మొత్తం తన చుట్టే తిరుగుతుందని చెప్పడం.. ముఖ్యంగా త్రివిక్రమ్ పై నమ్మకంతో సినిమాను ఓకే చేశానని వివరించింది. కానీ.. మూవీ రిలీజ్ అయిన తర్వాత తన పాత్ర సహాయ నటి పాత్రగా మారిపోయిందని.. షూటింగ్ ముందు ఒకలా చెప్పి.. సినిమాలో మరోలా తనను చూపించారని వెల్లడించింది. తర్వాత ఇక తనకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చేయని.. దీంతో ఇండస్ట్రీకి మెల్లమెల్లగా దూరమైనట్లు చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ తనను మోసం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ వల్లే తన కెరీర్ స్పాయిల్ అయిందని వివరించింది. ప్రేమ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.