టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర సినిమాల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అది కూడా ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్‌లు శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడిలతో.. ఈ ప్రాజెక్టులు కన్ఫర్మ్ అవ్వడం విశేషం.
ఇక విశ్వంభర షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందని.. ఈ ఏడాదిలోనే అనిల్ రావిపూడితో సినిమా సెట్స్‌లోకి చిరు అడుగుపెట్టనున్నాడని సమాచారం. ఇక ఎప్పటికి స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యినట్లు టాక్. అనిల్ వరుస హిట్లతో సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదే జోష్‌లో మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గ వింటేజ్ స్టోరీని చిరంజీవికి చెప్పి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టడం ఖాయమని వీరిద్దరూ స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని అనుకున్నారట. కానీ వాళెవరు చిరు పక్కన సెట్ కారేమో అని.. వారందరిని రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడట అనీల్.
ఈ క్రమంలోనే.. సీనియర్ ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్న అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పైగా చిరు పక్కన ఇప్పటికే ఆమె రెండు సినిమాల్లో మెరిసింది. ఇక అనిల్ డైరెక్షన్‌లో తమన్న సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి కూడా. ఇందులో హీరోయిన్ పాత్ర ఇంపాక్ట్ కూడా బాగుందని.. ఈ క్రమంలోనే తమన్నతో చిరంజీవి చేస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని ఆలోచనలో ఉన్నాడట అనీల్. ఇక సినిమా కోసం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలి ఉందని టాక్.