స్టార్ నటి హనీ రోజ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. రెండు, మూడు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. కొద్దిగా గ్యాప్ తర్వాత బాలయ్య వీర సింహారెడ్డి తో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ తర్వాత టాలీవుడ్‌లో మరే సినిమాలో అవకాశం రాలేదు.
ఇక ఓ పక్కన మలయాళంలో సినిమాలు నటిస్తూనే.. తెలుగు రాష్ట్రాల్లో పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో సందడి చేస్తుంది. ఇలాంటి క్రమంలో హనీ రోజ్‌పై ఓ నటి సంచలన కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారుతుంది. అసలు విషయం ఏంటంటే హనీ రోజ్ తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తుందని నటి ఫరా శిబిలా ఆరోపణలు చేసింది. ఫరా మాట్లాడుతూ మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం ఒక స్టెప్ తీసుకోవాలి. ప్రతిభను నమ్ముకునే కానీ.. శరీరాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళకూడదు అంటూ చెప్పుకొచ్చింది. హనీ రోజ్ గురించి మాట్లాడుతూ.. శరీరాన్ని చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నదని ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.
ఆమె డ్రెస్సింగ్ గురించి నేను మాట్లాడడం లేదు. కానీ.. ఆమె ఫోటోషూట్లలో రకరకాల ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఎన్నో రకాల యాంగిల్స్ లో ఫోటోలను, వీడియోలను స్వయంగా తానే షేర్ చేసుకుంటుంది. అందరూ కూడా తమ శరీరాలను చూపిస్తూ ఎగ్జిబిషన్లో పెడుతున్నారని.. హానిరోజ్ కూడా అలాగే చేస్తుంది అంటూ నటి సంచలన కామెంట్ చేసింది. ఇక హనీ రోజ్ అనుకున్నంత అమాయకురాలు కాదు.. తనకు అన్నీ తెలుసు.. డబ్బులు ఎలా సంపాదించాలనేది.. దాని కోసం ఆమె చేస్తున్నది తప్పు అభిప్రాయం అంటూ వెల్లడించింది.