టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ తర్వాత.. వరుసగా ఆచార్య, గేమ్ ఛేంజర్‌లతో డిజాస్టర్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టి సంచలనాలు క్రియేట్ చేయాలంటూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం తన నెక్స్ట్ సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. జాగ్రత్తలు తీసుకుంటే సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఉప్పెన సినిమాల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెండు స్కెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమాల్లో.. చరణ్ స్పోర్ట్స్ మాన్‌గా కనిపించనున్నాడు.
అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో క్రికెటర్‌గా మెరువనుడు. ఆర్సి 16 మూవీ అనౌన్స్ తర్వాత.. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే.. మరో క్రేజీ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది.. ఈ మూవీలో చరణ్‌తో పాటు.. స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక చరన్ క్రికెటర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్‌కు ట్రైనర్‌గా ఎం.ఎస్.ధోని ఈ సినిమాలో నటించనున్నాడట. ఇప్పటికే ధోని ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా త్వరలోనే సినిమా కూడా రానున్నట్లు సమాచారం.
ఇలాంటి క్రమంలో.. చరణ్ సినిమాలో నిజంగా ధోని నటిస్తే.. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోషన్స్ భారీ లెవెల్ లో జరుగుతాయని.. ఆడియన్స్ లో విపరీతమైన హైప్ నెలకొంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. చరణ్‌కు నార్త్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి ఎంఎస్ ధోని ఇమేజ్ కూడా తోడైతే.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ టాక్ నడుస్తుంది. మరి నిజంగానే ధోని ఈ సినిమాలో నటిస్తున్నాడా.. లేదా.. అనేది తెలియాలంటే టీం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఇక బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవనుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీం.