జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆయన కెరీర్ లో కొన్ని యావరేజ్, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్‌లో తారక్ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి రొమాన్స్ చేశారు. ఇక తను హీరోగా తెర‌కెక్కిన కొన్ని సినిమాల్లో రిపీటెడ్ హీరోయిన్లతో నటించిన సినిమాలు ఉన్నాయి. వారిలో గజాల, కాజల్ అగర్వాల్, సమంత, సమీరా రెడ్డి లాంటి హీరోయిన్లను తారక్‌ రిపీట్ చేస్తూ వచ్చారు.

టాలీవుడ్​కు అందుకే దూరమయ్యా'.. రూమర్లపై సమీరా రెడ్డి క్లారిటీ

ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో విదేశీ హీరోయిన్ తో కలిసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్ తో పాటు.. బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లతో ఎన్టీఆర్ నటించి ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్.. ఫేవరెట్ హీరోయిన్లు ఎవరై ఉంటారు తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కాగా ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఆయనతో కలిసి నటించిన హీరోయిన్లలో కొంతమంది ఆయనకు ఎంతో స్పెషల్. ఆయన సినీ కెరీర్‌లో వారి వల్ల బాగా కలిసొచ్చిందని అభిమానులు కూడా ఫీలవుతారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఒకటి. కాజల్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

After Kajal Aggarwal, Samantha dons producer's hat | After Kajal Aggarwal,  Samantha dons producer's hat

కాజల్ తర్వాత సమంత, తారక్ కాంబోలో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇక వీరిద్దరి కంటే ముందు ఎన్టీఆర్ కెరీర్‌ స్టార్టింగ్‌లో సమీరా రెడ్డితో అశోక్, నరసింహుడు సినిమాల‌ని తెర‌కెక్కించి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది అంటూ కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఇలా.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించినా.. ఈ ముగ్గురు హీరోయిన్లు మాత్రం చాలా స్పెషల్ అని.. ఆయనకు వీళంటే చాలా అభిమానం అని.. వీళ్ళతో కలిసి సినిమాలు చేయ‌డానికి ఆసక్తి చూపేవాడు అన్న టాక్ కూడా ఉంది.