నాని ప్రొడ్యూసర్‌గా ఇప్పటివరకు ఎన్ని కోట్లు కూడ‌వెట్టాడో తెలుసా.. మ‌హ ముద్దురే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్ త‌మ‌కంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో నాని కూడా ఒక‌డు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నాడు. అలా.. ఇప్పటివరకు నాలుగు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాని.. తాజాగా కోర్ట్ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవ‌హరించాడు. ఇప్పటివరకు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాలుగు సినిమాలు వరుసగా బ్లాక్‌బ‌స్టర్లు సాధించి నిర్మాతగాను మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. అంతేకాదు.. భారీ కలెక్షన్లతోను సత్తా చాటుకున్నాయి. ఏదేమైనా నాని ఇప్పటివరకు తెర‌కెక్కించిన సినిమాలు రిజల్ట్‌తో ఇండస్ట్రీలో టాప్‌ ప్రొడ్యూసర్ల లిస్టులోకి చేరబోతున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇటీవల.. నాని.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో ఓ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవ‌హరించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయనను టాప్ ప్రొడ్యూసర్‌గా మారుస్తుందంటూ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండ‌స్ట్రీని షేక్ చేసే రేంజ్‌లో కలెక్షన్లు కొలగొట్టడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు నాని ప్రొడ్యూసర్గా మారి.. దాదాపు రూ.200 కోట్ల వరకు లాభాలను అందిపుచ్చుకున్నాడంటే.. అది సాధారణ విషయం కాదు. అతి తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తెర‌కెక్కించి కోట్లలో లాభాలను కల్లగొట్టడంతో నాని మహా ముదిరన్ని.. పావలాకు రెండు రూపాయల లాభాన్ని అందిపుచ్చుకుంటున్నాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈయన మరోపక్క హీరో గాను తన సినిమాలతో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతూ తనదైన రీతిలో సత్తా చాటుతున్న నాని.. ప్రొడ్యూసర్ గాను ఈ రేంజ్ లో కలెక్షన్లు దక్కించుకుంటూ ముందుకు సాగడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. నాని చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. ఇటు హీరోగాను, అటు ప్రొడ్యూసర్ గాను దూసుకుపోతున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని డీటైలింగ్ చేసి ఆలోచించే నానికి.. స్క్రిప్ట్ పట్ల ఉన్న నాలెడ్జ్‌తోనే.. ఇదంతా సాధ్యమవుతుందని చెప్పాలి. ఇక ప్రస్తుతం నాని.. శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్‌ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ప్యారడైజ్‌తో పాన్ ఇండియన్ బాక్సాఫీస్‌ను నాని బ్లాస్ట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.