టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్‌గా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు తమకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు ఈ ముగ్గురు అన్న తముళ్లు తమ రంగాల్లో మంచి సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్నారు. ఇక చిరంజీవి నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ జనరేషన్ స్టార్స్‌తో సైతం.. పోటీ పడుతూ రికార్డులను స్ఋష్టిస్తున్ఆడు. తన సినిమాలతో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను ఇట్టే రాబడుతున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీలో బలమైన పొలిటిషన్‌గా ఎదిగి.. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక నాగబాబు జనసేన కీలక నేతల్లో ఒకరిగా ఆ పార్టీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు త్వరలో అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నాడు.
ఈ క్రమంలోనే ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఇక ఈ ముగ్గురి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు తన తమ్ముళ్లను సొంత బిడ్డల్లా భావిస్తాడు. అదే టైంలో పవన్, నాగబాబు అన్నయ్య.. చిరు పట్ల ఎంతో గౌరవ, అభిమానాలతో ఉంటారు. కాగా.. చిరంజీవి తన సొంత తమ్ముళ్ల కంటే ఆ వ్యక్తే ఎక్కువ అనే ప్రశ్నకు నాగబాబు అవునన్నే స్పందించారు. ఇంతకీ ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు..? నాగబాబు షాకింగ్ కామెంట్స్ వెనుక కారణం ఏంటో ఒకసారి చూద్దాం. మెగాస్టార్కు నాగబాబు, పవన్ కళ్యాణ్ కంటే కూడా నిర్మాత అల్లు అరవింద్ అంటే ఎక్కువ ఇష్టమట.. ఆయన మాటే చిరంజీవి వింటారనే ఓ వాదన ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది.
ఈ క్రమంలోనే చిరు పిఆర్పి పెట్టినప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు అల్లు అరవింద్‌కే వదిలేసారని.. అల్లు అరవింద్ సలహాలు, సూచనలనే చిరంజీవి పాటించేవారని.. కామెంట్లు వినిపించేవి.. దీనిపై నాగబాబు రియాక్ట్ అవుతూ.. నిజమేనంటూ చెప్పుకొచ్చాడు. అయితే అది కెరీర్ బిగినింగ్ లో అని.. పరిశ్రమకు వచ్చిన కొత్తలో అన్నయ్యకు పెళ్లయింది. ఆ టైంలో అల్లు అరవింద్ చిరంజీవికి సపోర్ట్ గా ఉండే వారిని.. ఆయన వ్యవహారాలన్నీ తానే చూసుకునే వారిని.. ఆయనకు అల్లు అరవింద్ స్వయంగా సలహాలు ఇచ్చేవాడని.. అంతేకాదు అల్లు అరవింద్ సజెషన్స్ చాలా బాగుండేవి అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. అయితే.. ఓ దశకు వచ్చాక.. అన్నయ్యకు ఆ అవసరం లేకుండా పోయిందని.. కానీ ఇప్పటికీ ఆ మార్క్ మాత్రం పోలేదంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవికి, అల్లు అరవింద్ సలహాదారే అని నానుడి ఇప్పటికీ కొనసాగుతుందంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.