టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నయో చూస్తూనే ఉన్నాం. అలాగే టెలివిజన్ స్క్రీన్ పై కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ సాధించిన సినిమాలు బుల్లితెరపై టిఆర్పి రేటింగ్‌తో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం టిఆర్పి రేటింగ్‌లో దశాబ్దాలు దాటిన ఇంకా టాప్‌లో కొనసాగుతూ ఉండడం విశేషం. అదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఈ సినిమా.. బుల్లితెరపై ఇప్పటికి సత్తా చాటుతుంది. 2017లో థియేటర్లలో రిలీజై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా.. టీవీ స్క్రీన్ లపై రిపీట్ టెలికాస్ట్‌లలో కూడా గ్రాండ్ టిఆర్పిని సొంతం చేసుకుంటుంది.
మొదటిసారి ప్రసారం నుంచే 29.8 టిఆర్పి దక్కించుకుని రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఈ రేంజ్ టిఆర్పి మరే సినిమాకు దక్కలేదు. ఇక టిఆర్పి టాప్ 5 జాబితాలో అల్లు అర్జున్ సినిమా అలవైకుంటపురంలో 29.4 టిఆర్పితో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జాబితాలో మూడో స్థానంలో అల్లు అర్జున్ నటించిన మరో మూవీ పుష్ప 1 కూడా.. 25.2 టిఆర్పిని దక్కించుకుంది. వీటిని బట్టే తమ ఫేవరెట్ హీరోల సినిమాలు టీవీ స్క్రీన్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థమవుతుంది. ఇక నాగార్జున నటించిన శ్రీరామదాసు.. భక్తి రసంతో నిండిన ఈ సినిమా 24 టిఆర్పి సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అప్పట్లో ఆల్ టైం హైయెస్ట్ రికార్డులు కొల్లగొట్టింది.
అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మగధీర 24 టి ఆర్ పి రేటింగ్ దక్కించుకుంది. ఇలా ఇప్పటివరకు ఈ ఐదు సినిమాలు హైయెస్ట్ టి ఆర్పి రేటింగ్ తెచ్చుకున్న టాప్ 5 లిస్ట్‌లోకి చేరాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ చేస్తూ మురిసిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్. సినిమాలో హిట్ ట్రెండ్‌ను తెలిపే విధానంలో.. టిఆర్పి రేటింగ్స్‌లో ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికీ హవా చాటుతున్నాయని.. దశాబ్ద కాలం నాడు రిలీజై.. భారీ టిఆర్పి దక్కించుకున్న ఎన్టీఆర్ సినిమా రికార్డును ఇప్పటివరకు ఎవరు టచ్ కూడా చేయలేకపోయారంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో.. ఈ రికార్డును ఏదైనా సినిమా బ్రేక్ చేస్తుందా.. లేదా.. చూడాలి.