సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుత్తూ మెగాస్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే చిరు పేరు చెబితే చాలు కోట్లాదిమంది ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇక ఈయన నటించిన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి టాలీవుడ్ చరిత్రనే తిరగ రాసిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్.. విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో త్వరలోనే సందడి చేయనున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.
మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో త్రిష హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాలో.. చిరు డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకోనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు చిరంజీవి సిద్ధమయ్యాడు. ఇప్పటికే సినిమా షూట్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో.. చిరంజీవికి సంబంధించిన ఓ సెన్సేషనల్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. ఇప్పటివరకు చిరు తన కెరీర్లో నటించని ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. దీనికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగా.. చిరుని కలవడం ఆయనతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.
చిరంజీవి ఓ సెన్సేషనల్ డెసిషన్ను తీసుకున్నడట. ఆయన స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు చిరంజీవి ఓ సినిమా కోసం హీరోకు తండ్రి పాత్రల్లో కనిపించిందే లేదు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరుతో ప్రభాస్ అంటే నిజంగానే బ్లాక్ బస్టర్ కాంబో అవుతుందని.. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అంటే ఇక సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్ లో ఉంటాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. మెగాస్టార్ అభిమానులు మాత్రం ఆయనను.. మరో స్టార్ హీరోకు తండ్రి పాత్రలో చూడడానికి యాక్సెప్ట్ చేస్తారో.. లేదో.. దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.