” కోర్ట్ ” ప్రొడ్యూసర్‌గా నాని.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి.. తాజాగా తెర‌కెక్కించిన‌ మూవీ కోర్టు.. స్టేట్ వర్సెస్ ఏ నోబడి.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ద‌క్కించుకొని రాణిస్తుంది. ప్రియ‌దర్శి ప్రధాన పాత్రలో.. రోషన్, శ్రీదేవి ఇత‌ర ప్ర‌ధాన పాత్రలో నటించిన ఈ సినిమాల్లో.. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక మార్చి 14న హోలీ సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు రామ్ జగదీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఈ సినిమా ప్రీమియర్ చూస్తూనే పాజిటివ్ టాక్‌ తెచ్చుకోవడంతో.. మొదటి రోజు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంది. కళాక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.

అలా.. ఇప్పటివరకు కోర్ట్‌ సినిమాకు.. ప్రీమియర్ షోలు, మొదటి రోజు కలెక్షన్లు అన్నింటినీ కలుపుకొని రూ.8.10 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలు తెర‌కెక్కిన ఈ సినిమా.. ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. ఇక నాని ఈ సినిమాకు దాదాపు రూ.11 బడ్జెట్ పెట్టిన‌ట్లు సమాచారం. మొదటి రోజుతోనే బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరలో కోర్టు కలెక్షన్లు రావడం.. అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వీకెండ్ కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రెడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ వారంలోనే సులువుగా సినిమా రూ.20 కోట్ల మార్క్ దాటేయొచ్చని అంచనా. ఇక ఇప్పటివరకు సినిమా ఓటిటి హక్కులకు గాని రూ.8 కోట్లు, ఆడియో హక్కులకు రూ.50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రూ.2 కోట్ల వరకు సినిమా ఖాతాలో పడినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాని భారీ లాభాలు కొల్లగొట్టడం ఖాయమని.. ప్రొడ్యూస‌ర్‌గాను మంచి కంటెంట్‌ను ఎంచుకోవడంలో నాని సక్సెస్ అయ్యాడు అంటూ విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.