ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. ‘ రాజాసాబ్ ‘ విషయంలో ఫ్యాన్స్ భయమే నిజమవుతుందా..?

రెబ‌ల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ రాజాసాబ్.. మారుతి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోయారు. మారుతి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ మారు మోగిపోయాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ను మారుతి ఎలా హ్యాండిల్ చేస్తారు.. ఆయనను ఎలివేట్ చేయడం మారుతి వల్ల అవుతుందా అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ.. ప్రభాస్, మారుతి మాత్రం ఈ ప్రాజెక్ట్ పై పూర్తి నమ్మకంతో మొదటి నుంచి పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభం నుంచి తనపై వచ్చిన నెగటివ్ కామెంట్స్‌కి.. తాను ఎప్పుడు ఫీల్ కాలేదని.. మంచి అవుట్‌పుట్ ఇవ్వడానికి మరింతగా అవి ప్రేరేపిస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు.

Prabhas wraps up Maruthi's comedy thriller The Raja Saab filming -  Bigtvlive English

ఈ క్రమంలోనే ది రాజాసాబ్‌ నుంచి మేకర్స్‌.. రీసెంట్గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఒక్కింత‌ ఆకట్టుకున్నాయి. ప్రభాస్‌ను ఓ ఇంటర్వ్యూ లుక్ లో చూపించడం అందరినీ మెప్పించింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో నమ్మకం కుదిరింది. వాస్తవానికి రాజాసాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ.. కొన్ని కారణాలతో ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు తాజా పరిస్థితులను బట్టి 2025 లోను సినిమా రిలీజ్ కాదని.. వచ్చేయడాది సంక్రాంతిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రాజాసాబ్ రిలీజ్ డేట్ వాయిదా కావడంతో మారుతి విషయంలో ప్రభాస్ డెసిషన్‌పై మరిన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Charming Prabhas From Raja Saab

మొదటి నుంచి మేము భయపడుతున్నట్టే సినిమా విషయంలో జరుగుతుందని.. అంతకంతకు రిలీజ్ చేయటం ఆలస్యం చేసుకుంటూ వస్తున్నారని.. ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఏదైతే అది అయింది.. ఇప్పటికైనా ప్రభాస్‌కు మారుతి హిట్ సినిమాను ఇస్తే బాగుంటుందని.. డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలో కామెడీతో పాటు.. హారర్ కూడా బాగా పండిందని.. సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కొల్లగొట్టడం ఖాయమని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూడడానికి ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు కనుక.. రాజాసాబ్ వారికి మంచి ఆప్షన్ అని టాక్.