సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి సంచలనం సిల్క్ స్మితకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మత్తు కళ్ళతో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం.. స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. ఆమె టైం ఇచ్చేవరకు తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఈ క్రమంలోనే సిల్క్‌స్మిత సైతం తన ఆటిట్యూడ్ను బాగా చూపించేది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సైట్స్ లో కాల్ పై కాలు వేసుకుని కూర్చుని మాట్లాడేది. ఓ కమెడియన్ వస్తే మాత్రం లేచి నిలబడి మరీ రెస్పెక్ట్ ఇచ్చేది. ఇంతకీ ఆ కమీడియన్ ఎవరో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి చూద్దాం.
సిల్క్ స్మిత సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చాలామంది ఆమెను తక్కువ చేసి చూసేవారట. లోకువగా మాట్లాడేవారట. కాస్త కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన స్మిత.. తర్వాత కెరీర్‌లో మంచి బ్రేక్ తెచ్చుకుంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో సైతం నటించింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీని ముద్దుగుమ్మ బాలీవుడ్ లో రాణించింది. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో ఆమెను చులకనగా చూసి.. అవమానంగా మాట్లాడిన వారు ఎవ్వరిని ఒక స్టేజికి ఎదిగిన తర్వాత అసలు వదల లేదట. అందరిపై రివెంజ్ తీర్చుకుంది. తనని ఎలా అవమానించారు అంతలా ఏమి కూడా వారిని అవమానించేదట. ఇందులో భాగంగానే చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద హీరోలు వచ్చినా కూడా కాలుపై కాలు వేసుకుని కూర్చున్నదట.
కానీ.. ఓ కమీడియన్ బాబు మోహన్ గారిని చూసినప్పుడు మాత్రం కాలు మీద కాలు తీసి.. లేచి నిలబడి మరీ పలకరించేదట. ఈ విషయాన్ని బాబు మోహన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేదని.. బాస్ అని పిలిచేదని చెప్పుకొచ్చాడు. నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి మీరే అని చెప్పేదని స్వయంగా బాబు మోహన్ వివరించాడు. ఓసారి ఫారెన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తనని ఆమె షాపింగ్‌కు తీసుకువెళ్లిందని అందులో నల్లని స్టైలిష్ కళ్ళజోడు కొనుక్కొని ఎలా ఉందో అడిగిందని. తను బాగుందని చెప్తే.. ఆ తర్వాత తీసి నాకు పెట్టిందని. నేను కూడా కళ్ళజోడులో హీరోలా కనిపించానని దాంతో వెంటనే ఆ కళ్ళజోడు నాకు ఇచ్చేసేదని.. దాని కాస్ట్ అప్పట్లోనే వేళల్లో ఉండేదని.. అయిన తనకోసం ఆ కళ్ళజోడుని ఇచ్చేసిందని.. బాబు మోహన్ వివరించాడు. ఇక సెట్స్‌లో ఎప్పుడూ నల్ల కళ్ళజోడు పెట్టుకునే కూర్చునేదని.. ఎవరెవరు ఆమెను చూస్తున్నారో.. ఎవరెవరు ఆమెను గమనిస్తున్నారో.. మెల్లగా గమనించేదని.. దాన్ని బట్టి ఎవరేంటో అర్థం చేసుకునేదని వివరించాడు. ఓ వ్యక్తిగా ఆమె చాలా మంచిదని.. ఒట్టి అమాయకురాలు.. కొందరిని నమ్మి మోసపోయిందని బాబు మోహన్ వివరించాడు.