ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు, నాలుగేళ్లకు సరిపడా కెరీర్‌ను సెట్ చేసుకున్న ప్రభాస్.. ఏడాదికి రెండు సినిమాలు తెరకెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ప్రభాస్ ఖాతాలో చేరిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. అదే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ ప్రాజెక్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుందట. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి.. డైరెక్టర్ ఎవరు.. అసలు ఆ విశేషాలు ఏంటో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం.. ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజి రెండు సినిమాల షూటింగ్లలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలు అయినా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మరో సినిమా నటించాల్సి ఉంది. వాటితో పాటే.. సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాలి. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో హోంబాలే ఫిలిం మరో సినిమాను తెరకెక్కిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందట. అలా ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్‌లో ప్రభాస్ నాలుగో ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. ప్రభాస్ సగం సినిమాలు ఆ బ్యానర్ పైనే తెరకెక్కయి. ఓ రకంగా డార్లింగ్ హోంబలే గుప్పెట్లో ఉన్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
మరి హోంబలేలో లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు కాకుండా సరికొత్త ప్రాజెక్ట్ ఏంటి.. దానికి డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు హనురాఘవపూడి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తోనే.. ఫౌజి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఈ క్రమంలోనే.. వీరి మధ్య అండర్ స్టాండింగ్ బాగా కుదరడంతో.. హనురాగవపూడికి ప్రభాస్ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అలా హోంబలే బ్యానర్‌పై హనురాగవపూడి, ప్రభాస్ కాంబో మరోసారి ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.