టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 2017 లో తెరకెక్కిన టెంపర్ సినిమా నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిగా రిలీజ్ అయిన దేవర వరకు తిరుగులేకుండా సక్సెస్లు అందుకున్నాడు. తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా మారాయి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి.. వారితో సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికి టాలీవుడ్ ఆడియన్స్‌లోను పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూట్ ముగిసిన వెంటనే కన్నడ స్టార్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో.. ఎన్టీఆర్ మరో సినిమాలో నటించనున్నాడు.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు దేవర పార్ట్ 2లో కనిపించనున్నాడు. కొరటాల శివ ప్రస్తుతం ఈ సీక్వెల్ పై కసరత్తులు మొదలు పెట్టాడు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమా నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఇప్పటికే రాజమౌళి.. ఎన్టీఆర్ డైరెక్షన్లో నాలుగు సినిమాలు వచ్చి నాలుగు మంచి సక్సెస్‌లు అందుకున్నాయి.
స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమ దొంగ, త్రిపుల్ ఆర్ ఇలా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకోవడంతో.. ఈ వార్తలు వాస్తవమైతే బాగుండు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమా తర్వాత తారక్.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ తో కూడా తారక్ సినిమా రానుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల లైనప్.. కెరీర్ ప్లానింగ్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆయన ఫ్యూచర్‌లో ఎంచుకున్న ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగాలని కోరుకుంటున్నారు.