సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు కోస్టార్లకు మధ్యన ఎఫైర్లు ఉన్నాయంటూ వార్తలు సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. సౌత్లో పోలిస్తే బాలీవుడ్‌లో ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు హీరోలతో డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు తెగ వైరల్ అవుతాయి. అలా.. ప్రస్తుతం ఉన్న హీరో, హీరోయిన్లు అందరూ గతంలో వేరొకరితో రిలేషన్షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించినా.. ఇప్పుడు మరొకరితో వివాహం చేసుకున్నారు. అంతేకాదు వారు శృంగారం గురించి కూడా మెచ్యూరిటీ పేరుతో చాలా ఓపెన్ కామెంట్స్ చేసేస్తారు. వారికి ఏమాత్రం తీసుకొని హీరో సౌత్ లోనూ ఒకరున్నారు. ఆయన మరెవరో కాదు లోకనాయకుడు కమలహాసన్. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఈయన.. యంగ్ ఏజ్‌లో ఎంతోమందితో రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు.
1970లోనే చాలామంది ముద్దుగుమ్మలతో డేటింగ్ చేసిన ఈ హీరో.. కెరీర్ స్టార్టింగ్‌లో తనకంటే పెద్దదైన నటి శ్రీవిద్యతో ప్రేమాయణం నడిపారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య రిలేషన్ కూడా చాన్నాళ్లు కొనసాగింది. తర్వాత కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతిని 1978లో వివాహం చేసుకున్నాడు. అంతా సవ్యంగా సాగుతుందన్న సమయానికి కమలహాసన్.. సారికతో ప్రేమలో పడటం వాణి గణపతికి విడాకులు ఇవ్వడం జరిగిపోయింది. ఇక సారికతో.. కమల్ హాసన్ పెళ్లికి ముందే శృతిహాసన్, అక్షరాహాసన్‌ను కన్నాడు. సారికతో రిలేషన్ షిప్ లో ఉండగానే వీరిద్దరూ పుట్టేశారు. తర్వాత వీళ్ళు వివాహం చేసుకున్నారు. అదే టైంలో హీరోయిన్ సిమ్రాన్‌తో కమల్ హాసన్ ఎఫైర్ నడుపుతున్నాడంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే మనస్పర్ధలతో సారిక డిప్రెషన్లోకి వెళ్ళింది. చేసేదేమీ లేక 2004లో కమల్ హాసన్ కు విడాకులు ఇచ్చిన రెండో భార్య సారిక ప్రస్తుతం సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక సారికతో విడాకుల తర్వాత కొంతకాలానికి నటి గౌతమీతో రిలేషన్షిప్ మొదలుపెట్టాడు కమల్. 13 ఏళ్ల పాటు కొనసాగిన లివింగ్ రిలేషన్షిప్ 2017లో ముగిసింది. ఈ విషయాన్ని నటి గౌతమి స్వయంగా వెల్లడించారు. తర్వాత కమలహాసన్ నటించిన విశ్వరూపం షూటింగ్ టైంలో నటి పూజా కుమార్‌తో ఆయన డేటింగ్ చేసినట్లు రూమర్లు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కమలహాసన్ కూతురు.. శృతిహాసన్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు కూడా తండ్రిలానే కెరీర్ స్టార్టింగ్ నుంచి సిద్ధార్ద్, ధనుష్, నాగచైతన్యతో పాటు ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా తో ప్రేమాయణం నడిపిందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే.. ఇవి మాత్రం కేవలం ప్రచారంగా మిగిలినా.. మైఖేల్ కోసలే, శాంతాను హజారికా లాంటి వారితో మాత్రం ఓపెన్ గానే డేటింగ్ చేస్తూ వారితో కలిసి క్లోజ్‌గా దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నఈ అమ్మడు.. ఇప్పుడు వాళ్లకు కూడా బ్రేకప్ చెప్పేసి సింగల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.