ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు మధ్యన కంపారిషన్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గతంలో స్టార్ హీరోలుగా రాణించిన సీనియర్ హీరోలు ఇప్పుడు మంచి క్రేజీగా దూసుకుపోతున్న యంగ్ హీరోలకు మధ్యన కంపారిజన్లు ఏర్పడుతున్నాయి. గతంలో హీరోస్‌లా.. ఇప్పుడు హీరోస్ ఎందుకు ఉండలేకపోతున్నారంటూ ప్రతి చిన్న వాటికి కంపారిజన్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓ స్టార్ హీరోను.. మరో సీనియర్ స్టార్ హీరోలతో కంపేర్ చేసి యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సీనియర్ హీరోలు గతంలో కథలను ఎంచుకునే విధానంలోనూ, సినిమాలను తెరకెక్కించే విధానంలోనూ ఇండస్ట్రీని ఎలాంటి బాటలో నడిపించారు.
ఇప్పుడు హీరోలు ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. ఎందుకు సీనియర్ హీరోలు చేసిన విధంగా యంగ్ హీరోస్ సక్సెస్ అందుకోలేకపోతున్నారని టాక్ నడుస్తుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోస్ చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు గతంలో ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను నటించేవారో తెలిసిందే . ప్రస్తుతం ఉన్న హీరోల్లా కాకుండా.. యాక్షన్, మాస్, మాస్ ఓరియెంటెడ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇలా అన్ని రకాల జానర్లను టచ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు.. హీరోస్ మాత్రం ఒక్క రొమాంటిక్ జోనర్ పైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. భారీ బడ్జెట్ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలపై శ్రద్ధే కనిపించడంలేదు. ఈ క్రమంలోనే ఒక్కటంటే ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా యంగ్ హీరోల నుంచి వచ్చిన దాఖలాలు లేవు.
దీంతో సోషల్ మీడియాలో నటించిన యంగ్ హీరోస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు మాస్, యాక్షన్ సినిమాలనే కాకుండా.. ఒక్కసారైనా ఫ్యామిలీ జోనర్ సినిమాలతో ఎంటర్టైన్ చేసి.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే బాగుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ జానర్లో మంచి కంటెంట్‌తో సినిమా తెరకెక్కితే పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటించిన సంక్రాంతికి వస్తున్నాను సినిమాను చూపిస్తున్నారు. అలాంటి సినిమాలను చూస్ చేసుకుని యంగ్ హీరోస్ నటిస్తే బాగుంటుందని వారి ఖాతాలో కూడా హిట్స్ పడడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యూచర్లో అయినా మన ప్రజెంట్ హీరోలు ఫ్యామిలీ జనార్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతారో లేదో చూడాలి.