టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత వరస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. చివరిగా సలార్, కల్కి సినిమాలతో భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత హనురాగపూడి డైరెక్షన్లో ఫౌజి సినిమాలో నటించనున్నాడు.
దీంతో పాటే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సిక్వెల్ గా సలార్ 2, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో కల్కి2 సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇలా ఏడాదికి రెండు సినిమాలతో.. ఆడియన్స్‌ను పలకరించడానికి ప్లాన్ చేస్తున్న ప్రభాస్.. లేటెస్ట్ లుక్స్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ప్రభాస్ ఫోటోలో డార్లింగ్ ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా కనిపించింది. ప్రభాస్ తన ఫ్రెండ్స్‌ను, ఫాన్స్‌ను ఎలా చూసుకుంటాడు ఎంత గౌరవం ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలాంటి క్రమంలో ప్రభాస్ ఓ అమ్మాయితో ఎంతో క్లోజ్‌గా ఉండడంతో.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఆ ఫోటో ఇప్పటి కాదట. బాహుబలి సినిమా టైంలో ప్రభాస్ ఆమెతో అంత క్లోజ్‌గా గా దిగిన ఫోటో.. ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తను మిల్కీ బ్యూటీ తమన్న బెస్ట్ ఫ్రెండ్. మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మానిక్ అని సమాచారం. ఇక ప్రభాస్ సెట్ లో తనతో పాటు కలిసి పనిచేసే వాళ్ళందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ క్రమంలోనే బెలి మానిక్ తోను ప్రభాస్‌కు మంచి ఫ్రెండ్షిప్ ఉందని సమాచారం. తాజాగా ఇప్పుడు మరోసారి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.