సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ స్టేటస్ లో అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ యుగంలో మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ బ్యూటీలుగా రాణించాలంటే మరింత కష్టపడాలి. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ తక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంటే తప్ప ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం. ఇక అందం, అభినయంతో పాటు.. అదృష్టం కూడా ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మంచి టాలెంట్ ఉన్న ఎంతోమంది హీరోయిన్స్ కూడా.. అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు.
కాగా.. కొందరు ముద్దుగుమ్మల మొదటి టాలీవుడ్ లో హీరోయిన్లుగా మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని.. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఒకటి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో సరైన అవకాశాలు మాత్రం అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో.. బాలీవుడ్‌కి చెక్కేసిన ఈమె.. అక్కడ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. అందం, అభినయంతో ఆకట్టుకున్నా.. సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ఈ హాట్ బ్యూటీ.,. కృతి కర్బంధ. పేరు చెప్తే తెలుగు ఆడియన్స్‌కు టక్కున గుర్తుకు రాకపోవచ్చు.
ఈమె తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలైనా కన్నడ ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్గా బిజీగా గడిపింది. తెలుగులో బోనీ అనే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ భాషలో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇటీవల బాలీవుడ్‌లో సినిమాలు నటిస్తోంది, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్న కృతికర్బంద.. తెలుగులో పవన్ కళ్యాణ్ తీన్మార్‌తో పాటు.. రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాల్లో మెరిసింది. బ్రూస్లీలో చరణ్ అక్క పాత్రలో ఆకట్టుకుంది. తర్వాత అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌కు చెక్కేసిన ఈ అమ్మడు.. అక్కడ కూడా ఆశించిన రేంజ్‌లో అవకాశాలు దక్కించుకోలేకపోతుంది.