టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్.. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఏ నో బడి.. తాజాగా రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ, సాయికుమార్, రోహిణి కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
నాని అక్క ప్రశాంతి తీపిర్నేని కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక దాదాపు రూ. 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. గత శుక్రవారం థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతూ రాణిస్తున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే రూ.15.90 కోట్ల వసూళను కొల్లగొట్టి బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది.
ముఖ్యంగా రెండో రోజు రూ.7.8 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా ఈరోజు ఆదివారం కావడంతో.. ఈ సినిమాకు మరింత రేంజ్‌లో భారీ వసూళ్లు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కోర్టు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత సక్సెస్ తో రాణిస్తుంది. ఇక ముందు ముందు ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో.. ఎలాంటి సంచలనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.