స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌లో ఒకప్పుడు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో ఒకటి, రెండు వెబ్ సిరీస్లలో తప్ప.. మరే సినిమాల్లోనూ నటించిందే లేదు. మరోవైపు ట్రలాల పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి శుభం పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం.. ఆమె అయోసైటీస్ భారిన పడడం అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.
ఈ క్రమంలోనే ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పటివరకు రీ ఎంట్రీ ఇవ్వలేదు. అయితే బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్‌లో కనిపించడంతో సమంత పూర్తిగా కోల్కుందని.. మళ్లీ థ్రో బ్యాక్ అవుతుందంటూ అభిమానులు భావించారు. కానీ.. తాజాగా ఈమె మరోసారి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నలకు మయోసైటిస్ బారిన పడిన సమంత.. శాకుంతల్ సినిమా ప్రమోషన్ టైం లో ఈ విషయాన్ని బయటపెట్టింది.
తర్వాత కొన్నాళ్లు పాటు ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్న శ్యామ్.. తర్వాత ఖుషి సినిమాలోను నటించింది. అయితే.. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించింది లేదు. ప్రస్తుతం సమంత హాస్పిటలైజ్ అయ్య చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న పిక్స్ వైరల్‌గా మారడంతో.. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇంకా సమంతకు పూర్తిగా మయోసైటీస్ తగ్గలేదా.. అసలు ఇది ఇప్పట్లో తగ్గదా అంటూ.. రకరకాల సందేహాలు మొదలయ్యాయి.