సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ పై ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలా ట్రెండ్ అయిన వార్తలన్నీ వాస్తవమే అని చెప్పడానికి లేదు. కొన్ని కొన్ని ఫాల్స్ వార్తలు కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇన్సైడ్ వర్గాల ఆధారంగా లీకైన కొంత సమాచారం సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది స్టార్ సెలబ్రిటీస్, ఎన్నో సినిమాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక రాజమౌళి తన సినీ కెరీర్‌లో ఎంత కష్టపడతారో.. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసు.
అంతేకాదు.. తనతో పని చేసే వారిని కూడా అలానే కష్టపెడతాడంటూ ఇప్పటి వరకు ఆయనతో కలిసి పనిచేసిన స్టార్ సెలబ్రిటీస్ వెల్లడించారు. అంతే కాదు.. రాజమౌళి పని రాక్షసుడని, ప్రతి సన్నివేశాన్ని జక్కన్నలా చెక్కుతూ ఉంటాడని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో రాజమౌళి తన సినీ కెరీర్‌లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓ సినిమాకు దర్శకత్వం వహించాడని న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు.. సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న. ఈ సినిమా రిలీజై.. బ్లాక్ బస్టర్ హిట్గా మారి రికార్డ్‌లు క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ సినిమా సక్సెస్ గురించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
మర్యాద రామన్న సినిమాను చాలా టైంపాస్గా రాజమౌళి తెరకెక్కించాడట. మగధీర సినిమా తర్వాత కేవలం ఆరు నెలల కాల్‌షీట్స్‌తో ఈ సినిమాను ఆయన రూపొందించారు. అయితే ఈ స్టోరీ జక్కన్న కెరీర్ లోనే స్పెషల్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అపట్లో జక్కన్న ఈ సినిమా కోసం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా టైం పాస్ చేస్తూ సినిమాను అలా తెరకెక్కించేసాడట. ఇక ఈ సినిమాతో సహా.. రాజమౌళి కెరీర్‌లో ఇప్పటివరకు తెరకెక్కించిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అయితే మర్యాద రామన్న సినిమాను మాత్రం చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో.. చిన్న కథగా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకోవడంతో రాజమౌళికి మరింత క్రేజ్ ఏర్పడింది.