మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య

అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్. గ‌తంలో లవ్ స్టోరీ సినిమాలో క‌లిసి న‌టించిన ఈ జంట‌ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న‌ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా క‌చ్చితంగా మంచి స‌క్స‌స్ అందుకుంటుందంటూ వివ‌రించారు. ఇటీవల సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చైతు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

వైజాగ్ నాకు ఎంతో స్పెషల్ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడుతుంది అంటూ వివరించాడు. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే.. నేను ఇక్కడ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు నా ఇంట్లో రూలింగ్ పార్టీగా వైజాగ్ ఏ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఇంటర్వ్యూలో వైజాగ్ రూలింగ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. వైవాహిక జీవితం చాలా బాగుందని, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. మా పెళ్ళై కొన్ని నెలలు అవుతుంది. ఈ సమయంలో ఇద్దరం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క మాకంటూ స్పెషల్ సమయం కేటాయించుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటాం.

Nagarjuna shares new pics from Naga Chaitanya Sobhita Dhulipala wedding -  India Today

మా ఇద్దరికీ ఉన్న సేమ్ లక్షణాల్లో ఇది ఒకటి. అలాగే సినిమాపై మాకు ఉన్న ప్రేమ మాటల్లో వివరించలేము.. లైఫ్ పైన మాకు ఎలాంటి ఆసక్తి ఉందో అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని.. భవిష్యత్తులో శోభిత నేను ఓకే సినిమాలో కలిసి నటిస్తామా.. లేదా.. అన్నది నేను ఇప్పుడే చెప్పలేను అంటూ వివరించాడు. మంచి స్క్రిప్ట్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే కచ్చితంగా కలిసి నటిస్తామని వివరించాడు. ఇక ప్రస్తుతం నాగచైతన్య.. శోభిత గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.