దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తమని తాము ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం వీళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని అభిమానులు కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని రాజమౌళి అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే ఎక్కడ రెస్ట్ లేకుండా షూటింగ్ ఫినిష్ చేయడానికి వరుస షెడ్యూల్‌లను ప్లాన్ చేస్తూ.. మరోసారి తన పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఇక రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి జక్కన్న.. మహేష్ సినిమాలో క్లైమాక్స్ మరింత డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఓ సినిమాలో ఎంతో మంది హీరోలు కామెడీ చేస్తూ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కాగా మహేష్ సినిమాలోని దాదాపు ఇండియాలోని టాప్ స్టార్స్ అంత భాగం కానున్నారని టాక్ నడుస్తుంది. ఏదేమైనా జక్కన్న ఈ ప్లాన్ చేయడం వెనుక.. పెద్ద విశేషం ఉందట. తను ఈ సినిమాలో స్టార్ హీరోలు అందరిని చూపించడానికి కారణం.. ఆయన చేసే ప్లాన్ ఏమై ఉంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
కానీ.. ప్రస్తుతం అందుతున్న వార్తలు ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్లో టాలీవుడ్ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలను చూపించబోతున్నాడని సమాచారం. ఈ ముగ్గురు హీరోలు మహేష్ బాబు సినిమాలో ఉంటే సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. అదే సినిమాలో అందరూ స్టార్ హీరోలను కలిపి చూపించడానికి ముఖ్య ఉద్దేశం.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మా స్టార్ హీరోలు గొప్ప అంటే.. మా స్టార్ హీరో గొప్పంటూ కొనసాగుతున్న వివాదాలేనని.. అందరు హీరోలని కలిపి ఒకే స్క్రీన్పై చూపించి మేమంతా ఒక్కటే అని ప్రేక్షకులకు మంచి ట్రీట్ తో పాటు.. మెసేజ్ ఇవ్వాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ అంతా ఇదే నిజమైతే బాగుండని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజమౌళి ఈ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.