బుల్లితెరపై చాలా ఫేమస్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ.. అనేక సీరీస్‌లు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్టార్‌డం దక్కించుకుంది. ఇటీవల ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆమె చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరోకాదు.. టీనా దత్త. కలర్స్ టీవీ ఉత్తరాన సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంట్టేనా ఈ సీరియల్‌లో తన పర్ఫామెన్స్‌తో టీఆర్పీ రికార్డ్‌లను బ్రేక్ చేసింది. ప్రస్తుతం టీనా దత్త ఒంటరిగా లైఫ్‌ను లీడ్ చేస్తుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టీనా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి వివరిస్తూ.. సింగిల్ మదర్‌గా ఉండటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.
ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా ఎవరితోనైనా తల్లి కాగలనని ఆలోచనలో ఉన్న అంటూ వివరించింది. ఆ సమయంలో తాను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం తొందరపడడం లేదంటూ చెప్పుకోచ్చిన టీనా.. భవిష్యత్తులో మాత్రం దత్తత తీసుకోవడం లేదా అద్ద గర్భం ద్వారా తల్లి కావాలని ఆలోచిస్తున్నట్లు వివరించింది. నేను మంచి తల్లి కాగలనని నమ్ముతున్నా.. కానీ ప్రస్తుతానికి నేను దాని గురించి ఆలోచించట్లేదు.. నాకు ఎలాంటి ప్రణాళిక లేదు.. సరైన టైం వచ్చినప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తా.. మంచి తల్లిగా నిరూపించుకుని అందరికీ చూపిస్తా.. నేను ఒంటరి తల్లిగా ఉండగలనా.. అని ఆలోచన ఎప్పుడు చేయలేదు అంటూ వివరించింది.
సుస్మిత సేన్‌కు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చిన టీనా దత్త.. సుస్మిత ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకున్న తీరు చూసి తను ఇన్స్పైర్ అయ్యానని వెల్లడించింది. తన నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతుగా ఉంటారని వివరించింది. భవిష్యత్తులో సరోగసితో తల్లి కావడం.. లేదా బిడ్డను దత్తత తీసుకోవడానికి ప్రయత్నిస్తా.. నా అభిప్రాయాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా గౌరవిస్తారంటూ వివరించింది. కుటుంబాన్ని ఒంటరిగా చూసుకోగలిగితే.. పిల్లలను కూడా ఒంటరిగా చూసుకోవచ్చని చెప్పిన టిన.. తనను చూసుకోవడానికి భర్త అవసరం లేదని.. పిల్లల బాధ్యత తీసుకోవడానికి భర్త సహాయం అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. ఆ బాధ్యతలను నెరవేర్చడానికి తాను మాత్రమే సరిపోతుందంటూ కామెంట్లు చేసింది.