ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్వయంకృషితో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి రాణిస్తున్న మెగాస్టార్.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఈ పొజిషన్కు వచ్చినవాడే. ప్రస్తుతం టాలీవుడ్లో సౌత్ ఇండియన్ కపూర్ ఫ్యామిలీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియన్ స్టార్ హీరోస్, నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోస్, ప్రొడక్షన్ హౌస్, బిజినెస్ లు ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ప్రత్యేక సినీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక చిరంజీవిది మొదటి నుంచి ఎంత ఎదిగిన.. ఒదిగి ఉంటే స్వభావం. ఇప్పటికి ఆయన కంటే పెద్ద వారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు.
సీనియర్ నట్లను అభిమానిస్తూ ఉంటాడు. అలా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్.. ఓ హీరోయిన్ ని ఎంతగానో అభిమానిస్తారు. ఆయన రోజు ఉదయం లేవగానే ఆ హీరోయిన్ ఫోటోనే చూస్తారట. ఇంతకీ ఎవరా నటి.. ఎందుకు అంత స్పెషల్ ఒకసారి తెలుసుకుందాం. ఆమె మరి ఎవరో కాదు మహానటి సావిత్రి. ఎస్.. మీరు విన్నది నిజమే. ఉదయం లేవగానే చిరు ప్రతిరోజు మహానటి సావిత్రి ఫోటోని చూస్తారట. అంతేకాదు.. ఆయన బెడ్ ఎదురుగా సావిత్రి ఫోటో ఒకటి ఎప్పుడూ ఉంచుకుంటారట. ఆమె అంటే ఆయనకు అంత అభిమానం అని స్వయంగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది.
హైదరాబాద్‌లో రీసెంట్గా మహానటి సావిత్రి క్లాసికల్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు చీర స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పిలవడానికి.. చిరంజీవి ఇంటికి విజయ చాముండేశ్వరి వెళ్లారట. అప్పుడు ఆయనకు కాలు దెబ్బ తగిలినా.. నేను వచ్చానని తెలిసి పైనుంచి కష్టపడి కిందకు దిగారు అని.. అంతేకాదు తనను ఎంతో మర్యాదగా చూసుకున్నారని విజయ చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ.. రోజు ఉదయం లేవగానే తను సావిత్రమ్మ ఫోటోనే చూస్తానని.. తన బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది అని వివరించారట. అలా చెప్తే తాను నమ్ముతుందో లేదో అని.. ఫోటోను కూడా తెచ్చి చూపించారట. ఈ విషయాని చాముండేశ్విరి స్వయంగా వివరించారు. దీన్నిబట్టి మెగాస్టార్ చిరంజీవికి సావిత్రి అంటే ఎంత గౌరవమో.. ఆమెను ఎంతలో ఆరాధిస్తారో అర్థం అవుతుంది.