సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడతారు. అవకాశం వచ్చినప్పుడు తమను ప్రూవ్ చేసుకోవాలని కసితో సినిమాల్లో నటిస్తారు. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న వారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాల పేరుతో మోసం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటే.. అవకాశం ఇచ్చి కమిట్మెంట్‌లు అడిగేవారు ఉంటారు. అలాంటి వాళ్ళను తట్టుకునే ఈ స్టేజ్ కి వచ్చానని.. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. 19 ఏళ్ల వయసులో ఓ డైరెక్టర్ తన గురించి చెడుగా ప్రవర్తించాడని.. నీచంగా మాట్లాడాడని.. డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటూ వివరించింది.
ఇటీవల జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్ సమ్మిట్ లో ప్రియాంక సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ తన లైఫ్ లో ఎదురైనా అవమానాల గురించి చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి నేను అడుగు పెట్టా. అప్పటికి సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. సినిమా కోసం సెట్స్ లోకి వెళ్ళి డైరెక్టర్‌ను కలిశా. ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్ డిజైనర్ కి చెప్పండి అని అడిగా.. అతను నా ముందే స్టైలిష్ట్‌కు ఫోన్ చేసి.. అసభ్యకరంగా మాట్లాడాడు. హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు.. ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి. లోదుస్తులు క్లియర్గా కనిపించాలి.. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించేలా.. ఆ కాస్ట్యూమ్ ఉండాలి అంటూ పదేపదే అదే పదాన్ని వాడుతూ మాట్లాడడాని వివరించింది.
హిందీలో ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా అనిపించాయి.. చాలా బాధ అనిపించింది.. డిప్రెషన్ కి వెళ్ళా.. మా అమ్మ దగ్గరకు వెళ్లి అతని నన్ను అంత చిన్న చూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేనని చెప్పేసా. మరుసటి రోజు డైరెక్ట్ దగ్గరకు వెళ్లి అదే మాట చెప్పి వచ్చేసా. ఇప్పటివరకు నేను ఆ డైరెక్టర్‌తో మళ్ళీ పనిచేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలి అనేది నా చాయిస్ అని ప్రియాంక వివరించింది ఇక బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక.. పెళ్లి తర్వాత హాలీవుడ్‌కు మక్కాం మార్చి అక్కడ కూడా తన సినిమాలతో ఆకట్టుకుంది. క్వాంటికోట్ ఎలివేషన్ సిరీస్ తో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న ఈ అమ్మడు.. తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్, లవ్ అగైన్, టైగర్ ఇలా వరుస సినిమాలో నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి – మహేష్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని కొట్టేసింది.