పాన్ ఇండియా లెవెల్‌లో నెటిజన్లు సినిమాల రివ్యూస్ లేదా సెలబ్రెటీలకు సంబంధించిన ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ఎక్కువగా ఉపయోగించే వెబ్సైట్ IMDB. ఇందులో ఏదైనా విషయం వచ్చిందంటే అది కచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది. అలా సినిమా భవిష్యత్తును నిర్ణయించే సత్తా ఉన్న వైబ్సైట్‌గా మంచి క్రేజ్ దక్కించుకుంది IMDB. కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడంలో ముందడుగు వేసింది. తాజాగా ఐఎండిబి 2024 టాప్ 10 పాన్ ఇండియన్ స్టార్ హీరోల లిస్టు విడుదల చేసింది.
ఈ లిస్టులో మొత్తం మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. పుష్ప 2తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. దీంతో గత ఎడాది నంబర్ వన్ స్థానంలో నిలిచిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ విశ్లేషకులు వెల్లడించారు. తర్వాత స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, మూడవ స్థానంలో కేజిఎఫ్ స్టార్ యష్, నాలుగవ స్థానంలో రణబీర్ కపూర్, అలాగే ఏడవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్, ఎనిమిదవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. ఓవరాల్గా టాలీవుడ్ నుంచి టాప్ టెన్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ పేర్లు మాత్రమే ఉండడం అందరికి షాక్ కలిగిస్తుంది.
11వ స్థానంలో ఎన్టీఆర్ ఉంటే.. 25వ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. ఇక గతేడాది పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఆయన లిస్టులోనే లేడు. కానీ మహేష్ మాత్రం గతేడాది గుంటూరు కారం సినిమా చేశాడు.. అలాగే రాజమౌళితో సినిమా అఫీషియల్‌గా ప్రకటించారు. అయినా 25వ స్థానం మహేష్ కు రావడం షాకింగ్‌గా అనిపిస్తుంది. అసలు IMDB సర్వే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది అనేది నెటిసన్స్‌కి అర్థం కాని విషయం. కాగా.. ప్రభాస్, చరణ్ అల్లు అర్జున్ పేర్లు మాత్రం గత మూడేళ్ల నుంచి టాప్ 10లో నిలుస్తున్నాయి. అంటే ఈ ముగ్గురు మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో నిజమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయం.