టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి29. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో కే.ఎల్.నారాయణ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో మరో సరి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకువచ్చి షూటింగ్ సరవేగంగా పూర్తి చేసే దిశలో వరుస షెడ్యూళను స్లాన్ చేశాడు.
ఇక రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జక్కన్న.. మహేష్ బాబు సినిమా విషయంలో బరింత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. మొదటి నుంచి ఆయన తెరకెక్కించే కథకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా గో్యంగా ఉంచే రాజమౌళి.. సినిమా రిలీజ్ సమయానికి విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసే స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలోను అదే ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఇందులో భాగంగానే సినిమాలో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీలను భారీ తారాగణాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక సినిమాలో హీరోయిన్గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. హాలీవుడ్‌లో తన సత్తా చాటుకుంటుంది. అందులో భాగంగానే ప్రియాంక చోప్రాన్ని తీసుకుంటే హాలీవుడ్, బాలీవుడ్ లోనూ మరింత ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో జక్కన్న ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీల రేంజ్ను బట్టి వారి రెమ్యనరేషన్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ నెటింట వైరల్ గా మారుతుంది. ఈ అమ్మడు మహేష్ సరసన నటించేందుకు ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌ను చార్జ్ చేస్తుందని సమాచారం. అయితే హాలీవుడ్ మీడియాలో మాత్రం ఏకంగా ప్రియాంక రూ.40 కోట్లు తీజుకుంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.