టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరిగా.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాతో బిజీగా మారిన తారీక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ డ్రాగన్‌గా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా డ్రాగన్ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇప్పుడు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, ఆర్టిస్టులు, టెక్నీషియన్ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. దేవర సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా తర్వాత కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.
ఈ సినిమా నార్త్‌లో మరింత ఎఫెక్ట్ చూపించింది. దీంతో.. తారక్ నుంచి యాక్షన్ సినిమాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారనేది క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో తారక మరోసారి ఫుల్ ఆఫ్ యాక్షన్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా.. ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. వార్ 2తో బిజీగా ఉండడం వల్ల తారక్ ఈ సినిమాను డిలే చేస్తూ వచ్చాడు. తాజాగా సినిమా షూట్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో షూట్ ప్రారంభం కానుందని.. ఇప్పటికే కాస్టింగ్ పూర్తిగా ఫిక్స్ అయిపోయిందని సమాచారం.
ఇందులో తారక్ జోడిగా.. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటులు టోవిన్ థామస్, బీజు మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ప్రశాంత్ నిల్ దర్శకుడుగా.. రవి బస్రూర్ సంగీతం అందించుతుండడం.. భువన్ గౌడ్ కెమెరామెన్, టి.యల్.వెంకట్ చలపతి ఆర్ట్ డైరెక్టర్గా వివరిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్, చేతన్ డిసౌజా సాండ్స్ కొరియోగ్రాఫర్‌గా పని చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టీం మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.