ఒకప్పుడు తినడానికి తిండే లేదు.. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తున్న స్టార్ కమెడియన్.. !

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ఆరాట‌పడుతుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. స్టార్ సెలబ్రిటీలుగా మారాలంటే కేవలం అందం, అభినయమే కాదు.. ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ క్రమంలోనే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఆఫీసుల‌చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు తినడానికి తిండి కూడా లేక.. రూమ్ అద్దెలు భరించలేక.. సినిమాల్లో అవకాశాలు రాక.. ఎన్నో అవస్థలుపడి వెనుతిరిగిన వారు ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో ఎన్నో అవమానుల తర్వాత అవకాశాలు దక్కించుకొని సత్తా చాటుకుని సెలబ్రిటీలుగా మారిన వారు ఉన్నారు.

Bharti Singh - Wikipedia

అలాంటివారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టార్ బ్యూటీ కూడా ఒకటి. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులతో సతమతమైనా ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వందల కోట్ల ఆస్తిని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మహారాణిలా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ అనుకుంటే మాత్రం పొరపాటే. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేడీ విలన్స్, లేడీ కమెడియన్స్ కూడా మంచి ఆదరణ పొందుతూ స్టార్లుగా మారుతున్నారు. అలా ఈ అమ్మడు కూడా తన్నా నటనతో, కామెడీ సెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్వులు పూస్తాయి. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో చెప్పలేదు కదా.. తనే బాలీవుడ్ స్టార్ బ్యూటీ భారతి సింగ్. కపిల్ శర్మ షో ద్వారా పాపులాఇటి దక్కించుకున్న భారతి.. తన కామెడీ పంచ్‌లతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

Comedian Bharti Singh's life interesting facts | कॉमेडियन भारती का सफर: कभी  बेहद गरीबी में बीता था भारती का बचपन, भरपेट खाना तक नहीं होता था नसीब, अब  सालाना कमाती ...

తనదైన యునిక్ స్టైల్‌తో కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం కామెడీ షోలోనే కాదు.. రియాలిటీ షోలలోను పాటిస్పేట్ చేసి తనదైన ముద్ర వేసుకున్న భారతి.. ఇప్పుడు స్టార్ కమెడియన్‌గా దూసుకుపోతుంది. అయితే ఈమె జర్నీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత.. ఈ స్టేజ్‌కు వచ్చాన‌ని.. తాజాగా ఓ ఫోడ్‌కాస్ట్ లో వివరించింది. ఆమెకు రెండు ఏళ్ళ వయసు ఉండగానే తండ్రి చనిపోయారని.. అప్పటినుంచి తల్లి కుటుంబ భారాన్ని మోసింది అంటూ చెప్పిన భారతి.. ఎన్నో కష్టాలతో తల్లి తమని పెంచిందని.. ఓ గర్మెంట్‌ ఫ్యాక్టరీలో బ్లాంకెట్లు కుట్టేది అంటూ చెప్పుకొచ్చింది. అర్ధరాత్రి సమయాల్లోనూ స్టిచ్చింగ్ చేస్తూనే కూర్చునేదని వివరించింది. ఆ సమయంలో తినడానికి తిండి కూడా ఇబ్బందిగానే ఉండేదని.. ఎండిపోయిన రొట్టెలను తినేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది. అలా ఎన్నో రోజులు గడిచాయని వివరించిన ఆమె.. ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమినరేషన్ తీసుకుంటున్న లేడీ కమెడియన్గా ఎదిగింది. ప్రస్తుతం చేత నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడి నికర ఆదాయమే దాదాపు రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.