టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర వెండి తెర అన్ని తేడా లేకుండా దాదాపు పాతికేళ్ళుగా స్టార్ యాంకర్‌గా దూసుకుపోతుంది సుమ కనకాల. ఇండస్ట్రీలోకి మధ్యలో ఎంతోమంది వచ్చారు.. వెళ్లారు.. కానీ సుమ ప్లేస్ మాత్రం ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. ఐదు పదుల వయసు మీదపడుతున్న ఇప్పటికీ అమ్మడి హవా మాత్రం కాస్త కూడా తగ్గలేదు. యాంకరింగ్‌లో పీహెచ్డీ చేసిన సుమ.. ఏ సందర్భంలో ఎలాంటి మాటలతో.. ఎవరిని ఎలా మెప్పించాలో.. డల్ గా ఉన్న వాతావరణంలో జోష్ పెంచి.. ఎలా ఎంటర్టైన్ చేయాలో అన్నీ తెలుసు. ఓ మలయాళీ అమ్మాయి అయినా తెలుగువారికంటే అద్భుతంగా తెలుగులో మాట్లాడుతూ ఎంతోమంది స్టార్ సెలబ్రెటీతో పాటు.. స్టార్ పొలిటిషియన్స్, తెలుగు భాషాభిమానుల ప్రసంసలు పొందుతూ వచ్చింది.
1975 మార్చి 27న కేరళ పాలక్కాడలో జన్మించిన సుమ.. అసలు పేరు పల్లాసన్న పాచివెట్టిల్ సుమ. ఇక తన చదువును స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్లో, రైల్వే డిగ్రీ కాలేజీలో పూర్తి చేసిన సుమ.. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యత పొందింది. ఇక తన పదహారేళ్ళ వయసులోనే యాంకరింగ్ వైపు మగ్గుచూపిన ఈ ముద్దుగుమ్మ.. హోస్టింగ్ కంటే ముందు కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకొని నటించింది. తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. పవిత్ర ప్రేమలో బాలయ్య చెల్లెలుగా మెప్పించింది. అతి తక్కువ టైంలోనే సినిమాల్లో సెటిల్ అవ్వడం కష్టమని భావించి.. బుల్లితెరపై కెరీర్‌ను ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే మధ్యమధ్యలో పరిశ్రమల్లో సినిమాలకు గెస్ట్ అపిరియన్స్ ఇస్తూనే.. బుల్లితెరపై యాంకర్ గా రాణించింది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత లీడ్ రోల్‌లో జయమ్మ పంచాయతీ సినిమాతో పలకరించింది. తన క్రేజ్‌తో మంచి కలెక్షన్‌లే కొల్లగొట్టిన ఈ అమ్మడు.. రాజీవ్ కనకాలను ప్రేమించే వివాహం చేసుకుంది. కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టి ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రోషన్ నుంచి ఓ సినిమా కూడా వచ్చింది. కాగా ఐదు బదులు వయసు మీద పడుతున్న సుమ అంత ఫీట్ గా యాక్టివ్ గా ఉండడానికి డైట్ ఫాలో అవుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.
అలాంటి క్రమంలో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. నిఖిల్ విజయేంద్ర సింహాతో కలిసి కార్యక్రమంలో సందడి చేసింది. ఈ సందర్భంలో సుమ తెచ్చుకున్న లంచ్ బాక్స్ చూసి ఆశ్చర్యపోయాడు నిఖిల్. బాక్స్ ఓపెన్ చేసి ఒక్కో ఐటెంను చూపిస్తూ.. గంట షో కోసం సుమ గారు ఎంత పెద్ద క్యారియర్‌ను తెచ్చుకున్నారో అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.