సినీ ఇండస్ట్రీ అంటేనే రంగులు ప్రపంచం. ఇక్కడ హీరో, హీరోయిన్ ఒకసారి కంటే ఎక్కువ కలిసి కనిపించినా.. ఒక సినిమాల కంటే ఎక్కువగా నటిచినా వారి మధ్య ఎఫైర్ వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొద్దిగా క్లోజ్ గా ఉంటే త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాల్లో హీరోయిన్లు ఆఫర్ల కోసం అది డిమాండ్ చేశారు.. ఇది డిమాండ్ చేశారు అంటూ.. కూడా పుకార్లు వినిపిస్తాయి. అలా గతంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ యాంకర్ అనసూయ పై కూడా ఇలాంటి వార్తలు వినిపించాయి. సోగ్గాడే చిన్నినాయన టైంలో నాగార్జున అనసూయకు ఆడి కార్ గిఫ్ట్ ఇచ్చాడని పుకారు తెగ వైరల్‌గా మరింది.
తాజాగా ఒక ఫోడ్‌కాస్ట్‌లో ఈ పుకారుపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. యూట్యూబర్ నిఖిల్ ఫోడ్‌క్యాస్ట్ చేస్తున్న నిఖిల్‌తో నాటకాలు అనే షోలో అనసూయ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇండస్ట్రీలో ఎవరైనా కాస్టింగ్ కౌచ్ అడిగారా అన్న ప్రశ్నకు అనసూయ హీరో, డైరెక్టర్ చాలామంది అడిగారని.. అదృష్టం కొద్ది నిర్మాతలు ఇప్పటివరకు అడగలేదు అంటూ వెల్లడించింది. ఇక అలా నో చెప్పడం వల్ల చాలా సినిమాలు వదిలి పెట్టానంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇండస్ట్రీలో చాలా రూమర్లు వస్తాయి.. అవన్నీ మీదాకా వస్తాయా అని అడగగా.. నేను చాలా సార్లు చూశా.. నాకు ఆడి కార్ ఎవరో యాక్టర్ గిఫ్ట్ ఇచ్చారట. నిర్మాత ఒకరు బహుమతిగా ఇచ్చారట అన్ని అనగానే.. నిఖిల్ నాగ్ సార్ అంటగా అని ప్రశ్నిస్తాడు. దానికి ఒక్కసారిగా అనసూయ నవ్వుతూ.. నాగ్ సరి కూడానా.. నేను, మా ఆయన కష్టపడి లక్ష 16 వేలు ఈఎమ్ఐ కడితే కోవిడ్ కన్నా ముందే లోన్ ఫినిష్ చేసి చాలా హార్డ్ వర్క్ తో కొనుక్కున్నాం. లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం. దానికి తగ్గట్టే కష్టపడతం. అందరిలాన్నే నేను కూడా ఎవరి దగ్గరకు వెళ్లిన ఇదే చెప్తా. నా దగ్గర బ్లాక్ మనీ లేదు. తాత, ముత్తాతల డబ్బు నాకు అక్కర్లేదు.. నా కష్టర్జీతం రూపాయి కూడా నేను వదలనంటూ అనసూయ వివరించింది.