సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. కొంతమంది మాత్రమే ఫుల్ ఆఫ్ సక్సెస్ రేట్‌తో ఎక్కువ కాలం కొనసాగుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇదే కోవకు చెందుతుంది. అంతేకాదు.. ఆమె మొత్తం మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ కూడా. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే శృతిహాసన్. శృతిహాసన్‌కు హీరోయిన్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత సక్సెస్ ఆలస్యమైంది. కానీ.. ఒక్క హిట్ పడిన తర్వాత ఈమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ దూసుకుపోయింది.
కెరీర్ మొదట్‌లో డిజాస్టర్లు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మకు.. ఐరన్ లెగ్ అనే ముద్రపడినా ఎక్కడ వెనుకడుగు వేయకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరీర్‌లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. అది కూడా సాధారణ సక్సెస్ కాదు.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 10 సంవత్సరాల ఎదురుచూపుకు చెక్ పెట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం.. శృతిహాసన్‌కు, పవన్‌కు ఎంతో ముఖ్యం. అలాంటి సమయంలో ఈ సినిమా రిజల్ట్ ఇద్దరినీ వేరే లెవెల్‌కు తీసుకెళ్ళింది. ఈ సినిమా తర్వాత శృతిహాసన్ నటించిన అని తెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్‌లే. శృతిహాసన్ ఇప్పటివరకు తెలుగులో 15 సినిమాల్లో నటించగా.. వాటిల్లో 11 సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి.
దీన్నిబట్టే శృతిహాసన్ హిట్ రికార్డ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐరన్ లెగ్ అని విమర్శించిన వారే.. ప్రస్తుతం గోల్డెన్ బ్యూటీ అంటూ ప్రశంసలు కురిపించే స్టేజ్‌కు ఈ ముద్దుగుమ్మ ఎదిగింది. ఇక మెగా ఫ్యామిలీలో శృతిహాసన్ పవన్ కళ్యాణ్‌తోనే కాదు.. చిరంజీవి, అల్లు అర్జున్, రాంచరణ్ నటించిన వారికి బ్లాక్ బస్టర్లు ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, రామ్ చరణ్‌తో ఎవడు, అల్లు అర్జున్‌తో.. రేసుగుర్రం, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి అన్ని సినిమాలతోను మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. రవితేజకు బలుపు, క్రాక్‌లతో సక్సెస్ ఇవ్వగా.. ప్రభాస్ కు.. సలార్, బాలయ్యకు వీర సింహారెడ్డి సినిమాలతో సక్సెస్ అందించింది. మహేష్ తోను శ్రీమంతుడు సినిమా నటించి బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇలా.. శృతిహాసన్ నటించిన 15 సినిమాల్లో 11 సినిమాలు మంచి సక్సెస్ అద్దుకోవడంతో.. టాలీవుడ్ లోనే లక్కీ బ్యూటీగా మారిపోయింది.