ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు మగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి నందమూరి నటసింహం బాలయ్య యాడ్ అయిపోయారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా సంక్రాంతి బరిలో బాలయ్య డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
గేమ్ ఛేంజర్ సినిమాకు కాంపిటీషన్‌గా వచ్చిన డాకు అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాకు బాలయ్య నటనతో పాటు.. థమన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. బాలయ్య వైల్డ్ పర్ఫామెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉందంటూ ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రెజెంట్ అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. తర్వాత గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో మరో సినిమా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. బాలయ్య త్వరలోనే మల్టీ స్టారర్‌లో కనిపించబోతున్నాడు అని సమాచారం. అఖండ 2 షూట్ పూర్తి అయిన వెంటనే.. గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా చేయనున్నాడు అంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి.
అంతేకాదు.. రవితేజకు క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ మరోసారి సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు అంటూ కూడా టాక్ నడిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గోపీచంద్ మలినేని బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమాను బాలయ్య ,రవితేజ కాంబోలో రానుందని టాక్. ఈ సినిమాలో అన్న, తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కౌట్ చేస్తూ.. ఇద్దరి క్యారెక్టర్స్ పవర్ఫుల్‌గా ఉండేలా గోపీచంద్ ఒక అద్భుతమైన కథను రాసుకున్నాడట. ఒకవేళ ఈ కాంబో నిజంగానే సెటైతే మాత్రం ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొంటాయి. అంతేకాదు బాలయ్య కెరీర్‌లోనే మరో బిగెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.