ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ యునైటెడ్ డబ్ల్యూ సినిమాల లిస్టులో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ డెబ్యూ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం మెగా అభిమానులే కాదు.. చాలామంది సాధరణ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అతన్ని ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే అకిరా నందన్ సినీ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. ఈ ఛార్మింగ్ బాయ్ తన అందం, స్మార్ట్ నెస్‌తో ఫిదా చేస్తున్నాడు. ఆరున్నర అడుగుల అకిరా పర్సనాలిటీ, చామింగ్ లుక్.. అపీరియన్స్‌తో ఇప్పటి వరకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నెలకొంది.
ప్రభాస్, రానా, వరుణ్ తేజ్ లాంటి టాలెస్ట్ హీరోల లిస్టులోకి అకిరా ఎంట్రీ తోనే జాయిన్ అయిపోతాడు అంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్వరలోనే అకిరా సినీ ఇంట్రీ ఉండనుందని వార్తల వినిపించిన అవేవీ వర్కౌట్ కాలేదు. కానీ.. కొద్ది రోజులో అతను ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసిందని.. తాజాగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అకిరా గుబురు గడ్డం, స్టైలిష్ అవతారంలో దర్శనమిచ్చాడు. అభిమానులు ప్రస్తుతం ఆ పిక్స్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా అకిరా తండ్రి పవన్‌తో కలిసి కేరళ, తమిళనాడు అంతా ఆలయాల పర్యటనలో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరుశురామా ఆలయాన్ని సందర్శించుకున్నారు ఈ తండ్రి, కొడుకులు.
ఇక స్పాట్ నుంచి రిలీజ్ అయిన ఫోటోలు అకిరా.. నల్లని గుబురు గడ్డంతో స్టనింగ్ లుక్‌లో కనిపించాడు. ఈ క్రమంలోనే అకిర గడ్డం, కొత్త లుక్ అంత సినీ ఎంట్రీ గురించి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఓ క్రమంలో అయితే అకిరాకు ఉన్న ఏజ్ రీత్యా ఇంత గడ్డం ఎలా వస్తుంది.. అసలు అది రియల్ గడ్డమేన అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. ఇది డబ్ల్యూ సినిమా కోసం పెంచాడా.. లేదా పెట్టుకున్నదా అంటూ కొందరు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెట్టుడు గడ్డంతో ఆలయాన్ని సందర్శనకు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.