ఈ టాలీవుడ్ నటుడు మాజీ సీఎం మేనల్లుడా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ‌తోమంది స్టార్ సెలబ్రిటీస్‌కు బయట కూడా ఎంతో మంది ప్రముఖులతో మంచి రిలేషన్, బాండ్ ఉంటుంది. అందులో సినీ, రాజకీయ రిలేషన్ చాలా ఎక్కువ. ఇక ప్రస్తుతం మనం ఈ పై ఫోటోలో చూస్తున్న నటుడు కూడా అదే కోవకు చెందుతాడు. నటుడు చిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మేనల్లుడు కావడం విశేషం. ఆర్జీవి శివ సినిమాతో ఓ న‌టుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చిన్న.. తర్వాత కూడా ఆర్జీవి తెరకెక్కించిన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా నటించిన పాపులారిటీ ద‌క్కించుకున్నాడు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన.. తను దివంగత మాజి సి ఎం నెదురుమ‌ల్లి జనార్దన్ రెడ్డి సొంత చెల్లి కొడుకున‌ని.. ఆయనకు మేనల్లుడు అవుతాను.. ఆయనకు కూడా నేనంటే ఎంతగానో ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం.. యాక్టర్ అయ్యాక చాలా సంతోషించారు. ప్రియమైన సమయంలోనే ఒకసారి క్యాబినెట్ అందరినీ పిలిచి మరీ నన్ను చూపించి ఇయ‌న ఎవరో తెలుసా అని అడిగితే.. వాళ్ళు యాక్టర్ చిన్న అని చెప్పారు.

Former AP Chief Minister passes away

కాదు.. నా మేనల్లుడు అంటూ ఎంతో గర్వంగా వివరించార‌ని ఆయన పేర్కొన్నాడు. నాకు మామయ్య పేరు వాడుకోవడం ఇష్టం లేదు.. అందుకే ఫోటోలు పట్టుకుని చాన్సుల కోసం స్టూడియోలు చుట్టూ తిరిగా యాక్టింగ్ ట్రైనింగ్.. అయిన తర్వాత ఒకసారి ఆయన దాసరి నారాయణరావుకి ఫోన్ చేసి నా మేనల్లుడు కొంచెం చూసుకొమ‌ని చెప్పారు. కానీ.. ఇండస్ట్రీలో రికమండేషన్‌తో పని అవదు అని ఆయన అన్నారు అంటూ వివరించాడు. ఇక ప్రస్తుతం చిన్న చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. సీఎం సొంత మేన‌మామైన పరపతి వాడకుండా కష్టపడే సినిమాల్లో నటుడిగా ఎదిగిన చిన్నని అందరూ ప్రశంసిస్తున్నారు.