తాళిబొట్టు కూడా కొనలేని స్టేజ్‌లో పూరి జగన్నాథ్‌కు పెళ్లిచేసిన నటి యాంకర్.. ఎవరో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న పూరీ జగన్నాథ్.. ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలు ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న వారే. ఈ క్రమంలోనే ఇప్పటికి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాంటి పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తన పెళ్లి టైంలో కనీసం తాళిబొట్టుకొనే స్థితిలో కూడా ఆయన లేడట.

Puri Jagannadh says: Anchor Jhansi bought mangal sutra

అయితే ఆ టైంలో పూరికి ఓ న‌టి.. అలాగే యాంకర్ పెళ్లి విషయంలో సహాయం చేశారని ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేశాడు పూరి జగన్నాథ్. తన ప్రేమ వివాహం గురించి మాట్లాడుతూ లావణ్యను ప్రేమించే వివాహం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టైం లో లావణ్య పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో గుడిలోకి వెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని.. ఆ క్రమంలో నా దగ్గర మూడు ముళ్ళు వేయడానికి కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితి అంటూ వివరించాడు.

Puri Jagannadh | ట్రెడిషనల్‌ గెటప్‌లో సతీమణితో పూరీ జగన్నాథ్‌.. స్పెషల్  ఏంటో తెలుసా..?-Namasthe Telangana

అదే సమయంలో యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొందని.. నటి హేమ పెళ్లి బట్టలు కొనిపెట్టింద‌ని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. కొంతమంది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్‌ను.. ఇతర ఇతర సహాయం అందించారంటు వివరించాడు. వివాహం తర్వాత మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో ఎదిగిన పూరి.. మంచి పేరే కాదు.. స్టార్ట్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ను దక్కించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది స్నేహితులని నమ్మి తీవ్రంగా మోసపోయిన పూరి తాను సంపాదించిన ఆస్తులను పోగొట్టుకోవడం ఫ్యాన్స్‌కు నిరాశ కల్పించింది. ఏదేమైనా తన పెళ్లి సమయంలో సహాయం చేసిన ఝాన్సీ మరియు హేమలను ఎప్పటికీ మర్చిపోలేన‌ని పూరి జగన్నాథ్.. ఇప్పటికి పలు సందర్భాల్లో వెల్లడించారు.