మా ప్రేమ కథలోను అద్భుతమైన సినిమా ఉంది.. కీర్తి సురేష్

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లవ్ స్టోరీలు వస్తూనే ఉంటాయి. ప్రేమలో పడిన హీరో, హీరోయిన్లకు ఎదురయ్యే కష్టాలు వాటన్నింటినీ ఎదుర్కొని వారు తమ ప్రేమను జయించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు ప్రేమదే విజయం అని చాట్ చెప్పే కథలు సుఖాంతం చేస్తారు. చాలా సినిమాల్లో ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాంటి కథల్లో ఒదిగిపోయిన చాలా మంది సెలబ్రెటీస్ తమ వ్యక్తిగత లైఫ్ లోను ప్రేమ లో సక్సెస్ సాధించిన వాళ్లే. అందులో టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఒకటి.

Keerthy Suresh to marry longtime boyfriend Antony Thattil in December:  Reports

గతేడాది అంటోనిని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మ్యారిడ్ లైఫ్‌కు శ్రీకారం చుట్టింది. మా ప్రేమ కథలోను ఓ సినిమా ఉందంటూ కీర్తి ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 15 ఏళ్ల ప్రేమ మాది. కబుర్లతో మొదలైన మా ప్రేమ.. తర్వాత రెస్టారెంట్లో కలవడం వరకు వెళ్లినట్టు వివరించింది. తర్వాత ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం. తర్వాతే అస‌లు ప్రేమ క‌థ మొదలైంది. మేము ఎంచుకున్న కెరియర్లు మమ్మల్ని చాలా దూరం చేశాయి. నేను ఇక్కడ సినిమాలతో బిజీగా గడుపుతుంటే.. తానేమో ఖతార్‌లో బిజినెస్ పరంగా రాణిస్తున్నారు. అలా ఆరేళ్లపాటు లాంగ్ డిస్టెన్స్ తర్వాత ఇప్పుడు ఇలా కలిసి ఉన్నాం.

Who is Keerthy Suresh Marrying?

ఈ ఆరేళ్లలో మా మధ్య ఏ రోజు ప్రేమ కాస్త కూడా తగ్గలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఒకరివృత్తిని మరొకరు గౌరవిస్తే ఆ బంధం ఎంతో బలంగా ఉంటుంది. ఆ సమయంలో తను నాకు ఒక ఉంగరం ఇచ్చాడు. అది పెళ్లి చేసుకునే వరకు కూడా నా వేలుకే ఉందంటూ చెప్పుకొచ్చింది. దాదాపు నేను నటించిన అన్ని సినిమాల్లోనూ ఆ ఉంగరం కనిపిస్తుంది. ఎప్పటినుంచో మేము కన్నా కల‌ పెళ్లి .. శ్రీకారం కావడంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ వివరించింది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి లవ్ స్టోరీ వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ ఈ స్టోరీని నిజంగానే ఓ సినిమా చేస్తే కచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ.. మరి కొందరు ఈమె లైఫ్ స్టోరీ తో సినిమానే తీసేయొచ్చు అంటూ కామెంట్లో చేస్తున్నారు.